Just In
- 47 min ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 1 hr ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 11 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 12 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Sports
India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!
- News
బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి సెన్సేషనల్ డిసీజన్.. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా.. మెగా ఫ్యాన్స్ సంబరాలు
తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగిపోతున్న మెగాస్టార్ చిరంజీవి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సామాజిక బాధ్యత వహిస్తూ సోషల్ వర్క్, అభిమానులపై ప్రేమ ఇలా ఎన్నో యాంగిల్స్‌లో తనదైన మార్క్ చూపించిన చిరు.. ఇక మెగా అభిమానులందరికీ పెద్దన్నయ్యగా పెద్ద దిక్కు కానున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ అసలు సంగతి ఏంటి? వివరాల్లోకి పోతే..

అశేష అభిమాన వర్గం.. ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ అందరు హీరోల్లోకెల్లా మెగాస్టార్ అభిమాన వర్గమే పెద్దది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ నాటి నుంచి నేటి తరం వరకూ పుట్టలు పుట్టలుగా ఆయన అభిమాన వర్గాలు ఉన్నాయి. అంతేకాదు ఆ అభిమాన సంఘాలు ఇప్పటిదాకా చిరుకి ఎక్కడా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్.. అభిమానుల కోసం చిరు
ఇలా చాలా పద్దతిగా ఉండే అభిమాన సంఘాల కోసం మెగాస్టార్ భారీ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా జీవిత భీమా అందించబోతున్నారట చిరంజీవి. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారట చిరు. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ టాక్ బలంగా వినిపిస్తోంది.

మెగా ఫ్యాన్స్‌ని గుర్తించేందుకు ప్రత్యేక ఫార్ములా
మెగా అభిమానులందరినీ ఒకచోట చేర్చి, వాళ్లకు జీవిత భీమా కల్పించే యోచన చేస్తున్నారట చిరంజీవి. ఈ మేరకు అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. అయితే మెగా ఫ్యాన్స్‌ని గుర్తించి వారికి జీవిత భీమా అందించేందుకు ప్రత్యేక ఫార్ములా కూడా రెడీ చేశాయట మెగా వర్గాలు.

సంబరాల్లో మెగా అభిమాన వర్గాలు
గతంలో కూడా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించినపుడు అభిమానులే చిరంజీవికి అండగా మైలబడిన సంగతి తెలిసిందే. అందుకు గాను అభిమానులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా అభిమానులకు జీవిత భీమా ఉండబోతుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ విషయం తెలిసి మెగా అభిమాన వర్గాలు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.

చిరంజీవి మూవీ అప్‌డేట్
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో సక్సెస్ సాధించిన ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.