చిరంజీవి ప్లాన్ ప్లాప్...సీన్లోకి మహేష్ బాబు!
హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు స్వస్తి చెప్పి రాజీయాకల్లోకి వెళ్లడం...అనేక పరిణామాల అనంతరం తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. సినిమాల్లో తనదైన ముద్రతో రాణించి మంచి పేరు తెచ్చుకుని టాప్ పొజిషన్ సాధించిన చిరంజీవి....రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేయడానికి, చిరకాలం తన పేరు గుర్తిండి పోవయేలా దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు.
చిరంజీవి వచ్చింది సినిమా రంగం నుండే కాబట్టి....ఆయన ఆలోచనలు సాధారణంగా ముందుగా అటు నుంచే మొదలవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే...సినిమావాళ్లు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని ఆలోచించే టైపు. ఈ క్రమంలో తాను పాతినిధ్యం వహిస్తున్న పర్యాటక రంగానికి సినీ గ్లామర్‌తోనే ప్రచారం కల్పిద్దామనే ఆలోచనకు వచ్చారట చిరు.
దేశ పర్యాటక రంగం ఆదాయం పెరిగేలా సినీ తారలతో ప్రచారం చేయించాలని ఫైనల్‌గా డిసైడ్ అయ్యారని....ప్రభుత్వం తరుపున చిత్రీకరించే యాడ్లలో తన కొడుకు రామ్ చరణ్ తేజకు ఛాన్స్ ఇప్పించాలని చిరంజీవి ప్రయత్నించారని సమాచారం. అయితే రామ్ చరణ్‌కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వస్తాయని, ఆశాఖ మంత్రిగా నీకు కూడా విమర్శలు తప్పవు అని కొందరు చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకించారట. రామ్ చరణ్‌ను కాకుండా బాగా పాపులారిటీ ఉన్న మహేష్ బాబు దీనికి కరెక్ట్ అని కొందరు చిరంజీవికి సూచించారట.


Click it and Unblock the Notifications











