చిరంజీవి సినిమాలో పవన్ కల్యాణ్: 45 ఏళ్లలో తొలిసారి ఇలా.. మూవీలో ఆ సీన్ వేరే లెవెల్ అంతే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన.. మధ్యలో గ్యాప్ తీసుకుని 'ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూ సత్తా చాటుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!

వరుస ఫ్లాపులు.. బిగ్గెస్ట్ హిట్
ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సంక్రాంతికి ఆయన 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.

భోళా శంకర్‌గా మారిన చిరు
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' మూవీని చేస్తోన్నారు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కీర్తి సురేష్ ఆయన సోదరి పాత్రను చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇస్తున్నాడు. ఇది 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

షూట్ స్పీడ్‌గా.. సగం కంటే
క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఇలా ఇప్పటి వరకు సగం పైగానే షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

రిలీజ్ డేట్‌పై రాని స్పష్టత
సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీని శరవేగంగా పూర్తి చేసి మేలో విడుదల చేస్తామని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అయితే, ఇప్పుడు చిత్రీకరణ పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి దీనిపై స్పష్టత మాత్రం రావడం లేదు.

హీరో అభిమానిగా చిరంజీవి
'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ పాత్రను చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రోల్ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా నటిస్తున్నారట. మూవీ మొత్తం దీనికి సంబంధించిన సన్నివేశాలను చూపించబోతున్నారని తెలిసింది.

ఆ సాంగ్‌ను రీమిక్స్ చేసేసి
పక్కా మాస్ మసాలా కథతో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో ఓ పాత పాటను రీమిక్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చిరంజీవి 'రామ్మా చిలకమ్మ' పాటనే చేస్తున్నారని అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ అభిమానిగా నటిస్తున్న చిరంజీవి 'ఖుషీ' సినిమాలోని ఓ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తోంది.

ఆ సీన్ కూడా హైలైట్‌గానే
'భోళా శంకర్' మూవీలో పవన్ కల్యాణ్ అభిమానిగా నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. అతడి హావభావాలను కూడా అనుకరిస్తూ కనిపిస్తారని తెలిసింది. ఇక, ఈ చిత్రంలో 'ఖుషీ' సినిమాలోని నడుము సీన్‌ను చిరంజీవి రీక్రియేట్ చేస్తున్నారని తెలిసింది. అయితే, అది ఎవరితో చేస్తారు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. మొత్తానికి చిరంజీవి సినిమాలో పవన్ ఇలా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











