చిరుగాలికి ఊగుతున్న కులపెద్దలు???
చిరంజీవి పార్టీ పెడతాడో లేదో తెలియదు కానీ రాజకీయ పార్టీలతో పాటు కులాలు కూడా గుబులు పడుతున్నాయి. గుబులు పడుతున్న కులాలలో ముందు వరుసలో ఉన్నది కమ్మ కులం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కావూరు సాంబశివరావు చిరంజీవి ఎఫెక్ట్ గురించి ఏకంకా కమ్మ పెద్దలతో కూర్చుని చర్చను కూడా పెట్టాడట. నాలుగు రోజుల క్రితం తన ఇంట్లో రహస్యంగా ఈ చర్చను కొనసాగించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సమావేశానికి అశ్వినీదత్, రామా నాయుడు, మురళీ మోహన్ తదితరులు హాజరయినట్టు సమాచారం. ఈ ముగ్గురూ తెలుగుదేశంతో నేరుగా సంబంధాలు ఉన్నవారే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











