‘రచ్చ’ కోసం సెన్సార్ బోర్డుపై చిరంజీవి ఒత్తిడి?
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు కత్తిరించిన అనంతరం సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తొలుత కత్తిరింపులకు దర్శక నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఈ చిత్రానికి తొలుత సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేయాలని భావించారట. ఈ నేపథ్యంలో విషయం చిరంజీవి వరకు వెళ్లిందని, చిరంజీవి తన పొలిటికల్ పవర్ ఉపయోగించి సెన్సార్ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మిపై ఒత్తిడి తెచ్చారని, ఎలాంటి కత్తిరింపులు లేకుండా U/A సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రెషర్ తెచ్చారని గిట్టనివారంటున్నారు.
అయితే సెన్సార్ బోర్డు సభ్యురాలు ధన లక్ష్మి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా డబుల్ మీనింగ్ డైలాగులు, పిల్లలు చూడటానికి వీల్లేని సన్నివేశాలకు నిస్సంకోచంగా కత్తెర పెట్టిందని అంటున్నారు. గతంలోనూ ధన లక్ష్మి పూరి పలు చిత్రాల విషయంలోనూ ఇలానే స్ట్రిక్ట్ గా తన డ్యూటీ నిర్వహించిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరని, ధనలక్ష్మి నిష్పాక్షికంగా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయని, అందువల్ల చిరంజీవి ఒత్తిడి పెట్టారనే వాదనలో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ' చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్. మణిశర్మ సంగీతం అందించారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి ఈ చిత్రానికి సమర్పకులు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.


Click it and Unblock the Notifications











