మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి చిరుతో కలిసి రామ్ చరణ్

Recommended Video

Ram Charan And Megastar Chiranjeevi To Act Together || Filmibeat Telugu

'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా వచ్చి రెండేళ్లు గడిపోయినా ఆయన మరో సినిమా విడుదల కాలేదు. అయితే, ప్రస్తుతం నటిస్తున్న 'సైరా: నరసింహారెడ్డి' అక్టోబర్ 2న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా బ్యాలెన్స్ వర్క్ మొత్తం ఫినిష్ చేస్తుంది. ఇక నుంచి స్పీడు పెంచాలని భావిస్తున్న చిరు.. త్వరలోనే మరో సినిమాను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది.

 కొరటాలతో సినిమా

కొరటాలతో సినిమా

‘సైరా: నరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ స్క్రిప్టును చిరు విన్నారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

షూటింగ్ ప్రారంభం ఆరోజే

షూటింగ్ ప్రారంభం ఆరోజే

చిరు ‘సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుందని టాక్.

 హాకీ కోచ్‌గా చిరు

హాకీ కోచ్‌గా చిరు

ఇందులో చిరంజీవి హాకీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. అవును.. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరంజీవికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాను గతంలో బాలీవుడ్‌లో వచ్చిన ‘చక్‌దే ఇండియా' సినిమాతో పోల్చేస్తున్నారు.

రామ్ చరణ్ కీలక పాత్ర

రామ్ చరణ్ కీలక పాత్ర

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో కథను మలుపు తిప్పడంతో పాటు సినిమాలో తరచూ కనిపిస్తూ ట్రావెల్ అయ్యే పాత్ర ఒకటి ఉందట. దాని కోసం ఈ బడా డైరెక్టర్ చెర్రీని అడిగారని సమాచారం. దీనికి అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

తండ్రి కొడుకుల కలయికలో..

తండ్రి కొడుకుల కలయికలో..

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ఇప్పటికే మూడు సినిమాల్లో జంటగా కనిపించారు. ఇండస్ట్రీ హిట్ ‘మగధీర', ‘బ్రూస్‌లీ'లో చిరు అతిథి పాత్రలో నటించారు. ఇక, చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్ ఒక పాటలో స్టెప్పులేశాడు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే మెగా అభిమానులకు పండుగే కదా.

‘సైరా’ గురించి..

‘సైరా’ గురించి..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X