లూసిఫర్ రీమేక్‌లో మరో స్టార్ హీరో.. చిరంజీవిని ఢీ కొట్టేందుకు రెడీ
ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించబోయే లూసిఫర్ రీమేక్‌కు సంబంధించిన నటీనటుల ఎంపిక వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన లూసిఫర్‌ను తెలుగులో పున: నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌తోపాటు నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రల ఎంపిక చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఎవరెవరినీ పరిగణనలోకి తీసుకొన్నారంటే..

వివేక్ ఒబేరాయ్ తప్పుకోవడంతో
లూసిఫర్‌లో కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌ని సంప్రదించారు. తొలుత ఈ పాత్రను పోషించడానికి సానుకూలంగా ఉన్నారనే వార్త వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆయన చేతులెత్తేయడం జరిగిందట. దాంతో విలన్ పాత్ర కోసం తమిళ నటుడు రెహ్మాన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో పలు తెలుగు చిత్రాల్లో రెహ్మన్ కీలకపాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

రానా దగ్గుబాటి అతిథి పాత్రలో
లూసిఫర్‌లో మరో రెండు కీలకమైన అతిథి పాత్రల కోసం కూడా ఎంపిక జరిగినట్టు సమాచారం. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్ పాత్రల కోసం క్రేజీ యువ హీరోలను రంగంలోకి దించుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి పాత్రల కోసం రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ధృవీకరణ జరుగలేదు. అయితే రానా నటించడం ఖాయమైపోయిందనే వార్తలు మీడియాలో వినబడుతున్నాయి.

చిరంజీవి చెల్లెలుగా సుహాసిని
ఇక లూసిఫర్ సినిమాలో మమ్ముట్టికి సోదరిగా నటించిన మంజు వారియర్ పాత్రకు అలనాటి హీరోయిన్, చిరంజీవికి సన్నిహితురాలు సుహాసినిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ పాత్రలో నటించడానికి ఆమె కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు రెండు దశాబ్దాదాల తర్వాత సుహసిని, చిరంజీవి నటించడం గమనార్హం.

బాలీవుడ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు
ఇక లాసిఫర్ రీమేక్ కోసం బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ సంగీత దర్శక ద్వయాన్ని రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో బ్రహ్మండంగా రాణిస్తున్న అజయ్, అతుల్ జంటను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇలాంటి క్రేజీ వార్తలతో లూసిఫర్ చిత్ర రీమేక్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ నటీనటులు సాంకేతిక వర్గాల ఎంపికపై అధికారికంగా ప్రకటన చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
Recommended Video

ఈ ఏడాది చివర్లో లూసిఫర్ సెట్స్‌పైకి
వాస్తవానికి అంతా అనుకూలంగా ఉంటే.. లూసిఫర్ మూవీ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుండంతో సినిమా షూటింగులు నిలిచిపోవడం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తే.. ఆచార్యను వెంటనే పూర్తి చేసి లూసిఫర్‌ను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నటీనటులు ఎంపిక ప్రక్రియను వేగం చేశారు.


Click it and Unblock the Notifications











