చిరంజీవి నో అంటే.. ప్రభాస్ ఎస్.. ఇదీ మ్యాటర్!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. అశ్వినీదత్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించనున్నామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూవీ పూర్తయిన వెంటనే ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల కాంబోలో రాబోతున్న ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది. ఒక మంచి సోషియో ఫాంటసీ సినిమా కథతో నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే ముందుగా ఈ కథను చిరంజీవితో రూపొందించాలని ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్.

మొదట కథను మెగాస్టార్ చిరంజీవికి చెప్పగా, ఆ కథ నచ్చినప్పటికీ మెగాస్టార్ నో అన్నారట. దీంతో అదే కథకు ఎవరు బాగా యాప్ట్ అవుతారని ఆలోచించిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ వద్దకు వెళ్లడంతో ఆ కథ విన్న వెంటనే ప్రభాస్ ఓకే చెప్పేశారని సమాచారం. అలా చిరంజీవి నో చెప్పిన కథ తోనే ప్రభాస్ ముందుకెళ్తున్నారని టాక్ నడుస్తోంది.
హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఈ కథ ఉంటుందట. అందుకే మొదట చిరంజీవి అనుకున్న నాగ్ అశ్విన్.. ఆయన నో చెప్పడంతో ఆ తర్వాత ప్రభాస్‌ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనప్పటికీ మరోసారి తన టాలెంట్ చూపించేందుకు ప్రభాస్‌కి ఇది సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











