»   » చిరంజీవి 150వ సినిమా రెమ్యూనరేషన్ ఎంత?

చిరంజీవి 150వ సినిమా రెమ్యూనరేషన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి చేయబోయే 150వ సినిమా ఇపుడు అంతటా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించారు. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

కాగా ఇపుడు.....150వ సినిమాకు చిరంజీవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు? అనేది చర్చనీయాంశం అయింది. చిరంజీవి చివరగా 2007లో 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా చేసారు. అప్పడు ఆయన పరిశ్రమలోనే అత్యదికంగా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వారని సమాచారం.

చిరంజీవి పరిశ్రమను వదిలి దాదాపు ఏడేళ్లు అయింది. ఈ ఏడేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇపుడు పరిశ్రమలో టాప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారి రెమ్యూనరేషన్ రూ. 20 కోట్ల పైనే ఉంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం పవన్ కళ్యాణ్ 23 కోట్లు, మహేష్ బాబు 21 కోట్లు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నారు.

మన పక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతూ ఒక్కో సినిమాకు రూ. 30 కోట్ల పైనే చార్జ్ చేస్తున్నారు. చిరంజీవి కూడా దాదాపు రజనీకాంత్ స్థాయి హీరో. ఇక చిరంజీవి చాలా కాలం తర్వాత 150వ సినిమా చేస్తున్నారు కాబట్టి రెస్పాన్స్ ఓ రేంజిలో ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో బయటి బ్యానర్లలో చేస్తే రెమ్యూనరేషన్ చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 25 నుండి 30 కోట్లు ఉంటుందని అంచనా.

అయితే చిరంజీవి తన 150వ సినిమా బావమరిది అల్లు అరవింద్ కు చెందిన 'గీతా ఆర్ట్స్'లో గానీ, రామ్ చరణ్ నిర్మాతగా గానీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారట. సొంత బేనర్లో చేసినప్పటికీ రెమ్యూనరేషన్ లెక్కలు ఉంటాయి. మరి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు అనేది ఆసక్తికరం. కాలమే దీనికి సమాధానం చెప్పాలి. స్లైడ్ షోలో ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ వివరాలు

చిరంజీవి

చిరంజీవి


పరిశ్రమలో చిరంజీవి హోదా... 150వ సినిమాకు ఉన్న డిమాండ్, వచ్చే రెస్పాన్స్ బట్టి చూస్తే ఆయన రెమ్యూనరేషన్ 25 నుండి 30 కోట్ల మధ్య ఉంటుందని అంచనా

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 23 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఇక టాలీవుడ్ నుండి మహేష్ బాబు సెకండ్ ప్లేసులో ఉన్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 21 కోట్లు తీసుకుంటున్నాడట.

రామ్ చరణ్ తేజ్..

రామ్ చరణ్ తేజ్..


మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగ్రేటం చేసి అనతి కాలంలో తెలుగు స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ తేజ్ రూ. 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఇక స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు అన్ని కలిపి రూ. 17 కోట్లు తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


ఇక టాప్ 5లో చోటు దక్కించుకున్న జూ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 15 కోట్లు తీసుకుంటున్నాడట.

రజనీకాంత్

రజనీకాంత్


ఇక తమిళ హీరో రజనీకాంత్ అత్యధికంగా రూ. 32 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ జాబితాలో ఉంది.

విజయ్

విజయ్


తమిళ స్టార్ హీరో విజయ్ రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

సూర్య

సూర్య


తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడు.

అజిత్

అజిత్


తమిళ హీరో అజిత్ ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటున్నాడట.

విక్రమ్

విక్రమ్


మరో తమిళ హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

English summary

 Right now, superstars like Pawan Kalyan, Mahesh Babu and Ram Charan are being paid around Rs.22 crores. If chiranjeevi prefers other production houses, he is likely to be paid between Rs.25 crores and Rs.30 crores as his remuneration and which maybe an all time record remuneration among the South top heroes alongside Rajinikath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu