twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆచార్యకి ఆ సెంటిమెంట్ రిపీట్.. ఖుష్ అవుతున్న మెగా ఫ్యాన్స్!

    |

    చివరిగా సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద మెగా అభిమానులు అయితే విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. అయితే మెగా అభిమానులను మరింత సంతోషపరిచే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది..

    అదేమిటంటే చిరంజీవికి గతంలో కలిసి వచ్చిన ఒక సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా ఫాలో అవుతున్నారు అని తెలుస్తోంది. ఆచార్య సినిమాలో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుందని, ఉత్తేజ పరిచే విధంగా ఉండే ఆ సాంగ్ లో మహాకవి శ్రీశ్రీ రాసిన కొన్ని వాక్యాలను వినిపిస్తారని తెలుస్తోంది. అయితే దానిని పాటలో భాగంగా మలిచారా లేక పాట మధ్యలో డైలాగ్స్ లాగా వినిపిస్తారా అనే దానిమీద క్లారిటీ లేదు. నిజానికి శ్రీ శ్రీ రాసిన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే కవితను చిరంజీవి తన సినిమాల్లో రెండు సార్లు వాడుకున్నారు.

    Chiranjeevi Repeating sri sri Sentiment	for Acharya

    ముందుగా రుద్రవీణ సినిమాలో చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అనే పాట చివర్లో నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను లాంటి కొన్ని పాదాలను వినియోగించుకున్నారు. ఆ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా ఆ తర్వాత ఠాగూర్ సినిమాలో కూడా అలాంటి ఒక పాటను వాడుకున్నారు. సుద్దాల అశోక్ తేజ నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ శ్రీ శ్రీ పద్యాన్ని పాట కోసం వాడారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఆచార్య సినిమా కోసం కూడా ఒక పాట కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు మెగా ఫాన్స్. దానికి తోడు ఆ రెండు సినిమాలకు జాతీయ అవార్డులు కూడా రావడంతో ఈ సినిమాకు కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు.

    English summary
    as per latest buzz Chiranjeevi will be repeating an old sentiment for Acharya. Chiranjeevi’s two films – Rudraveena and Tagore have used sri Sri’s iconic poem ‘Nenu Saitham’. It is rumoured that for Acharya too, lines from the iconic poem will be taken.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X