శేఖర్ మాస్టర్‌కు చిరంజీవి షాక్.. ఈ ఊహించని నిర్ణయం ఎందుకు?

టాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్లే వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌తో సాగిపోతోన్నారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే మూవీని చేస్తున్నారు.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తీస్తున్నారు. ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi Replaces Shekar Master to Vijay and Shobi for Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూళ్లను జరిపారు. ఇందులో చిరంజీవి, త్రిషతో పాటు కొందరు నటీనటులు భాగం అయ్యారు. ఇప్పుడు కూడా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమా కోసం ఎంతో మంది స్టార్ యాక్టర్లతో పాటు టెక్నీషియన్లను కూడా తీసుకుంటున్నారు. అలా ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన కొన్ని పాటల కోసం కొరియోగ్రాఫర్లు విజయ్ బిన్ని (నా సామిరంగ డైరెక్టర్), శోభిలను తీసుకున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ రెండు పాటలను కంపోజ్ చేశారు. వీటి షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైంది.

Chiranjeevi Replaces Shekar Master to Vijay and Shobi for Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ల ఎంపికపై తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. ఆయన గత రెండు చిత్రాల్లో శేఖర్ మాస్టర్‌కే మొత్తం పాటలను ఇచ్చారు. అవన్నీ చాలా బాగా వచ్చాయి కూడా. అలాంటిది ఇప్పుడు 'విశ్వంభర' సినిమాకు ఆయనకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారట. అందుకే వేరే కొరియోగ్రాఫర్లను తీసుకున్నారని తెలిసింది. అయితే, దర్శకుడు మల్లిడి వశిష్ట కోరిక మేరకే శేఖర్‌ను కాదని వేరే కొరియోగ్రాఫర్లను తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X