ఎన్టీఆర్, రాంచరణ్‌కు రాజమౌళి మోక్షం.. చిరంజీవి మంత్రం బాగానే పనిచేసిందంటూ..

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రత్యేకమైనవిగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న RRR (రౌద్రం రుధిరం రణం) ఒకటి. దీనికి కారణం... ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తుండడమే. అంతేకాదు... ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇంతటి పేరున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు మీకోసం.!

రియల్ హీరోల కోసం కలిసిన స్టార్ హీరోలు

రియల్ హీరోల కోసం కలిసిన స్టార్ హీరోలు

‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రుధిరం రణం). స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీలో చరణ్, తారక్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

 ఎన్నో అవాంతరాలు... విడుదల ఆలస్యం

ఎన్నో అవాంతరాలు... విడుదల ఆలస్యం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే కావొస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ డెబ్బై నుంచి ఎనభై శాతం మాత్రమే పూర్తయింది. నటీనటులకు గాయాలు.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం సహా కరోనా ప్రభావంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో విడుదల మరింత ఆలస్యం అవుతుంది.

ఇద్దరూ బుక్ అయ్యారు.. సినిమా కష్టమే

ఇద్దరూ బుక్ అయ్యారు.. సినిమా కష్టమే

ఎన్నో అవాంతరాల వల్ల ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండేళ్ల వరకు బుక్ అయిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అలాగే, రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. మరో సంవత్సరం పాటు వీళ్ల సినిమాలు వచ్చే ఛాన్స్ లేదు.

 ఎన్టీఆర్ లైన్‌లో పెట్టాడు.. చెర్రీ నో రొస్పాన్స్

ఎన్టీఆర్ లైన్‌లో పెట్టాడు.. చెర్రీ నో రొస్పాన్స్

ప్రస్తుతం RRR షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్... తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఆ తర్వాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు, రామ్ చరణ్ మాత్రం తన సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ మధ్య పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరూ కన్ఫార్మ్ కాలేదు.

RRR నుంచి తప్పుకుంటున్న ఎన్టీఆర్

RRR నుంచి తప్పుకుంటున్న ఎన్టీఆర్

కరోనా ప్రభావంతో షూటింగ్ నిలిచిపోవడంతో RRR విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మిగిలిన సినిమాల షెడ్యూల్స్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి మాత్రం అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు మరో సినిమా చేసుకోవడానికి వెసలుబాటు కలిగించారనేది తాజా సమాచారం. దీంతో త్రివిక్రమ్ సినిమాపై ఇప్పుడు ఎన్టీఆర్ ముందుకెళ్తున్నట్టు తెలిసింది.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
రాజమౌళి.. తప్పక ఒప్పుకున్నాడట

రాజమౌళి.. తప్పక ఒప్పుకున్నాడట

‘ఆచార్య'లో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో... తమ సినిమా కోసం అతడి డేట్స్ అడ్జస్ట్ చేయమని చిరంజీవే స్వయంగా రాజమౌళిని కోరాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అతడిని కొన్ని రోజులు రిలీవ్ చేయడానికి అంగీకరించాడట జక్కన్న. ఈ గ్యాప్‌లో తారక్‌కు సంబంధించిన షూట్ పూర్తి చేసి.. మొత్తం సినిమా నుంచి అతడిని త్రివిక్రమ్ సినిమా కోసం రిలీవ్ చేస్తారనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X