రెట్టింపైన చిరంజీవి బాధ్యతలు.. తప్పని పరిస్థితుల్లో రామ్ చరణ్!
ఓ హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా బిజినెస్ వ్యవహారాల్లోనూ చురుకుగా ఉంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో హీరోగా చేస్తున్న ఆయన.. తండ్రి చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన RRR సినిమా షూటింగ్ పట్ల సీరియస్‌గా ఉన్న జక్కన్న ఇక వేగంగా షూటింగ్ జరపనున్నాడట. దీంతో రామ్ చరణ్ తన సైరా నిర్మాణ బాధ్యతలను చిరుకే అప్పగించేశారని సమాచారం.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న RRR ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే మహారాష్ట్రలో భారీ షెడ్యూల్ జరగనుంది. ఇందుకోసం ఏకంగా నెలన్నర సమయం పట్టొచ్చట. దీంతో సైరా పనులకు రామ్ చరణ్ బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే తన భాద్యతలు ఎవరితో ఉంటాయో అవనీ నాన్న చిరంజీవికే అప్పగించాడట రామ్ చరణ్. అవసరమైనప్పుడు సహకరించేలా బాబాయ్ నాగబాబుతో మాట తీసుకున్నాడట. ఇప్పటికే 'సైరా' కి సంబంధించి బిజినెస్ డీల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక నుంచి హీరోగా చేస్తూనే 'సైరా' నిర్మాణ వ్యవహారాలు కూడా చిరునే చూసుకుంటారని టాక్.

తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రామ్ చరణ్ నిర్మాణంలో సైరా నరసింహా రెడ్డి మూవీ తెరకెక్కుతోంది. మేజర్ పార్టీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన విడుదలకు సిద్ధమైంది. మరోవైపు జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా RRR వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2020 జులై 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కూడా భారీ ప్రాజెక్టులు కావడంతో రామ్ చరణ్ తెగ బిజీ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











