‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మెగా‌స్టార్ చిరంజీవి పాత్ర కూడా?

By Bojja Kumar

'మహానటి' సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్' గురించే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికర వార్త తెరపైకి వస్తోంది.

బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రతో పాటు సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, శ్రీదేవి, కృష్ణ లాంటి వారి పాత్రలు చూపించబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పాత్ర?

మెగాస్టార్ చిరంజీవి పాత్ర?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంటుందట. ఎన్టీఆర్-చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి' సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్' బయోపిక్‌లో చిరు పాత్ర ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి.

 చిరంజీవి పాత్రలో ఎవరు?

చిరంజీవి పాత్రలో ఎవరు?

అయితే చిరంజీవి పాత్ర ఉంటుందనే విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆయన పాత్ర ఎవరు పోషిస్తారనేది కూడా ఆసక్తికరమే. మరి దీనిపై దర్శకుడు క్రిష్ ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందనేది ప్రేక్షకుల అభిప్రాయం.

చంద్రబాబు పాత్రలో రానా

చంద్రబాబు పాత్రలో రానా

కాగా... ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, రానా ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే విషయమై వివరించినట్లు సమాచారం.

బాలయ్య పాత్రపై అందరిలోనూ ఆసక్తి

బాలయ్య పాత్రపై అందరిలోనూ ఆసక్తి

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే... అయితే బాలయ్య పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయాన్ని సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్‌గా ఉంచాలని భావిస్తున్నారు. ఈ పాత్రలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటించే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

ప్రముఖుల పాత్రలు

ప్రముఖుల పాత్రలు

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనువిందు చేయబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్‌.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీ రంగారావు, కృష్ణ, శ్రీదేవి పాత్రల చేస్తారనేది త్వరలో వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X