మెగా ఫ్యామిలీ రహస్యం: ఇంకెన్నాళ్లు నాన్చుతారు!

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెడితే.....పవన్ కళ్యాణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' ఆడియో వేడుకకు ఎందుకు రాలేదు? అనే కోణంలో మీడియా వారు సరికొత్త వార్తలు వండకుండా చిరంజీవి ముందుస్తుగానే తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' 150 డేస్ ఫంక్షన్‌కు వస్తారంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి ఊహాగానాలకు బ్రేక్ వేసారు.

ఇక రామ్ చరణ్ కూడా....బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన పరోక్షంగా తెచ్చారనే వాదనేది పలువురి అభిప్రాయం. ‘మన ఫ్యామిలీని కలుపుకోవాల్సిన బాధ్యత మనదే' అని ఆయన వ్యాఖ్యల వెనక నిగూఢ అర్థం దాగి ఉందని అంటున్నారు. వాస్తవానికి ఇది ‘గోవిందుడు అందరి వాడేలే' సినిమాలోని కాన్సెప్టు కావొచ్చు. కానీ ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు కుంపటి వ్యవహారంపై రామ్ చరణ్ ఇండైరెక్టుగా సుద్దులు చెప్పినట్లు ఉందని కొందరి అభిప్రాయం. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ విడిపోవద్దని రామ్ చరణ్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

 Chiranjeevi's 150th film in 2015

నిజం చెప్పాలంటే....చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది, వీరిద్దరి మధ్య ఉన్న నాగబాబు వ్యవహార శైలి ఎలా ఉందనేది మెగా అభిమానులకు, ప్రజలకు తెలియని విషయంఏమీ కాదు. కానీ సాక్ష్యాలు చూపించడం మాత్రం కాస్త కష్టం. ఇది ఎప్పటికీ మెగా ఫ్యామిలీ బహిరంగ రహస్యమే! వీలైనన్ని నాళ్లు ఈ రహస్యం జనాలకు తెలిసి తెలియనట్లు నానుతూనే ఉంటుంది.

ఇక చిరంజీవి 100వ సినిమా విషయానికొస్తే....ఈ విషయంలో మరోసారి చిరంజీవి అభిమానులను నిరాశ పరిచారనే చెప్పొచ్చు. 150వ సినిమాకు కథ కుదరలేదు, ఎప్పుడు కుదురుతుందో చెప్పలేను అని నేరుగా చెప్పేసారు. ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో మాత్రం ఆయన 150వ సినిమా ఉండదని తేలి పోయింది. రామ్ చరణే నిర్మాత అని స్పష్టమయింది. ఓ విషయం మాత్రం క్లారిటీగా చెప్పుకోవచ్చు. 2014 సంవత్సరంలో చిరంజీవి 150వ సినిమా ఉండదని తేలి పోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X