చిరంజీవి 150వ సినిమా: ఫైనల్ షార్ట్‌లిస్టులో ముగ్గురు!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి త్వరలో 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయ టెన్షన్స్ లేకుండా ఉన్న ఆయన తన పూర్తి దృష్టంతా 150వ సినిమాపైనే పెట్టారు. అయితే తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం చిరంజీవి ఓ కథను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. అయితే ఎవరి కథ ఫైనల్ చేసారు? ఎలాంటి కథ అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.....150వ సినిమాకు దర్శకుడిని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. టాలీవుడ్లోని పలువురు దర్శకుల టాలెంటును పరిశీలినలోకి తీసుకుని వడపోసి....షార్ట్ లిస్టు రెడీ చేసారు. ఈ షార్ట్ లిస్టులో దర్శకుడు వివి వినాయక్, శ్రీను వైట్ల, కృష్ణ వంశీ ఉన్నట్లు సమాచారం.
ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరిని ఫైనల్ చేయనున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

కథ ఎలాంటిదంటే...
మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్ కథల వైపే మొగ్గు చూపుతున్నారు చిరంజీవి. సురేఖ సమర్పణలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

వివి వినాయక్
దర్శకుడు వివి వినాయక్ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. ఇపుడు ఆయన కాస్త వెక బడ్డప్పటికీ మంచి విషయం ఉన్న దర్శకుడే. కమర్షియల్ సినిమాలు తీయడంలో ఎర్స్‌పర్ట్. గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి భారీ హిట్ అందించారు.

శ్రీను వైట్ల
దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. ఫ్యామిలీ, యాక్షన్, కెమెడీ కలగలిపి సినిమాలు తీయడంలో దిట్ట. వరుస విజయాలతో ఆయన టాప్‌లో కొనసాగుతున్నాడు.

కృష్ణ వంశీ
దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం చాలా వెనక బడి ఉన్నారు. అయితే ఆయనకు క్రియేటివిటీ కలిగిన దర్శకుడిగా పేరుంది. మరి చిరంజీవి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











