twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి- కొరటాల శివ మూవీ అప్‌డేట్.. మెగాస్టార్ పైనే ప్రయోగం చేస్తూ డిసీజన్!

    |

    సాధారణంగా సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారనే సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేయడం, సెంటిమెంటల్‌గా సినిమా పేర్లు పెడుతుండటం లాంటివి చేస్తుంటారు. కాగా తాజాగా సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ మాత్రం తన సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అది కూడా చిరంజీవిపైనే ప్రయోగం చేయబోతున్నారట. ఇంతకీ అసలు సంగతేంటి అంటారా..! వివరాల్లోకి పోతే..

    సైరా తర్వాత చిరంజీవి

    సైరా తర్వాత చిరంజీవి

    గత కొంతకాలంగా సైరా నరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి.. అక్టోబర్ 2 వ తేదీతో ఆ బిజీ నుంచి బయటకొస్తారు. ఇక ఆ వెంటనే ఆయన తన తదుపరి సినిమా కొరటాల శివ సెట్స్ పైకి వచ్చే అవకాశముంది. ఈ మేరకు కొరటాల శివ కూడా అంతా సిద్ధం చేస్తున్నారట.

    కొరటాల శివ గత సినిమాలు

    కొరటాల శివ గత సినిమాలు

    అయితే కొరటాల శివ గత సినిమాలు ''మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భరత్ అనే నేను'' సినిమాల‌కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ స్ట్రాటజీ మారుస్తున్నారట కొరటాల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

    మెగాస్టార్ పైనే ప్రయోగం

    మెగాస్టార్ పైనే ప్రయోగం

    చిరంజీవి- కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్నారట కొరటాల. చిత్ర సంగీత దర్శకుడి విషయంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి దేవి శ్రీ ప్ర‌సాద్ బదులుగా సైరాకు బాణీలు కట్టిన అమిత్ త్రివేదిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే.. మెగాస్టార్ పైనే కొరటాల తన ప్రయోగం చేయబోతున్నారన్నమాట.

    గ్రామీణ నేపథ్యం.. రైతుగా చిరు

    గ్రామీణ నేపథ్యం.. రైతుగా చిరు

    చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కథాంశం గ్రామీణ నేపథ్యంలో ఉండనుందని సమాచారం. ఇందులో రైతుగా చిరు కనిపించనున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తుండగా.. హాకీ కోచ్‌గా చిరు డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నాడని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికైతే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

    త్వరలోనే పూర్తి వివరాలు

    త్వరలోనే పూర్తి వివరాలు

    అతి త్వరలో మెగా 152 కి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో చిరు సరసన ఇలియానా నటించనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వీటన్నింటికీ చెక్ పడాలంటే చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సిందే మరి!

    English summary
    Mega power star Ram Charan is the reason for Koratala Siva and Chiranjeevi up coming movie delay. Now latest talk is Chiranjeevi is ready to go on sets of Koratala Siva. The Shooting will strats from October 2nd week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X