చిరంజీవి సినిమాలో యంగ్ హీరో.. అనిల్ రావిపూడి ఫార్ములాతో బాబీ..
సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఖాతాలో పడిన బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఇండస్ట్రీ మొత్తం ఈ విజయంపై చర్చించుకుంటోంది. ఈ సినిమా సాధించిన రికార్డులు, వసూళ్లు చూసి మెగాస్టార్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే ఉత్సాహంతో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే, అనిల్ రావిపూడి ఫార్ములాతో డైరెక్టర్ బాబీ ఫాలో అవుతున్నాడా? అనేది హాట్ టాఫిక్ మారింది.
చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు బాబీ కొల్లి. ఇప్పటికే ఓ క్రేజీ పోస్టర్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని టాక్. జనవరి 25న పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికలో టీమ్ బిజీగా ఉంది.

భారీ బడ్జెట్-మాస్ అవతార్
ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, లోహిత్ ఎన్.కే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో ఈసారి మరింత పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో చిరంజీవిని చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఫుల్ మాస్ ట్రీట్ ఉంటుందని టాక్.
అనిల్ రావిపూడి ఫార్ములా.. బాబీ స్ట్రాటజీ?
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో గెస్ట్ రోల్ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకు అదనపు హైప్ తీసుకొచ్చింది. ఇదే ఫార్ములాను చిరంజీవి-బాబీ సినిమాలో కూడా అప్లై చేయాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నారట. రెండో భాగంలో దాదాపు 20 నిమిషాల పాటు చిరంజీవితో పాటు ఓ యంగ్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో ఉంటుందని, కథకు స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుందని టాక్.
యంగ్ హీరో ఎవరు?
ఈ స్పెషల్ రోల్ కోసం మొదట తమిళ హీరో కార్తీ పేరు వినిపించినప్పటికీ, చివరకు తెలుగు యంగ్ హీరోనే తీసుకోవాలని బాబీ ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న ఓ కుర్ర హీరోకు ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాత్ర ఎవరిది అన్నదానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన విశ్వంభర సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకూ చిరంజీవి కమిట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి,ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. బాబీ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాలో మాస్ అవతార్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే ఓ యంగ్ హీరో స్పెషల్ రోల్ అనే అంశాలు కలిస్తే.. ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











