‘ఆచార్య’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్: ఒకేసారి రెండు పండుగలు.. చిరంజీవి ఫోకస్ మాత్రం దాని మీదే
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల అందించిన ఆయన.. ఇప్పుడు ఏకంగా చేతి నిండా ప్రాజెక్టులతో సత్తా చాటుతున్నారు. ఈయన ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆచార్య' ఒకటి. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ పలు కారణాల వల్ల కంప్లీట్ కాలేదు. దీంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మెగా మల్టీస్టారర్‌గా వస్తోన్న ‘ఆచార్య'
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

నక్సలైట్ బ్యాగ్‌డ్రాప్‌తో.. నేపథ్యం ఇదే
కొరటాల శివ సినిమా అంటే సందేశాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఆ దెబ్బతో అంచనాలు... బిజినెస్ హై
మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ మొత్తం ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రైట్స్ అమ్ముడుపోయాయి.

షూటింగ్ రీస్టార్ట్ అప్పుడే.. రిలీజ్ డేట్
'ఆచార్య' షూటింగ్ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడిపోయిన షూటింగ్‌ను ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. దాదాపు 14 రోజుల పాటు షూట్ చేసి.. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తారట. ఆ వెంటనే దీని రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలిసింది.

ఒకేసారి రెండు పండుగలు వచ్చేలా ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న 'ఆచార్య' మూవీ కొత్త రిలీజ్ డేట్‌పై ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అది కూడా అక్టోబర్ 13 లేదా 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని తెలిసింది. అదే జరిగితే ఫ్యాన్స్‌కు రెండు పండుగలు వచ్చినట్లే.

చిరంజీవి దృష్టి మాత్రం దాని మీదేనట
వాస్తవానికి 'ఆచార్య' మూవీని సంక్రాంతికి విడుదల చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, చిరంజీవి దృష్టి మాత్రం దసరా మీదే ఉందని అంటున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో అప్పుడైతేనే సినిమాకు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











