For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆచార్య’ హైలైట్ పాయింట్స్ లీక్: ఆ రెండు చోట్లా గూస్‌బమ్స్ ఖాయం.. చిరు కెరీర్‌లోనే చూడని విధంగా!

  |

  'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటు ఆయనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ప్రస్తుతం 'ఆచార్య' చేస్తున్నారు. మెగా మల్టీస్టారర్‌గా రాబోయే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులోని హైలైట్లు తాజాగా లీకయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  Recommended Video

  Acharya Movie లో Ram Charan 'సిద్ధ' పాత్ర వివరాలు ఇవే !
  చిరంజీవిని ఆచార్యగా మార్చిన కొరటాల శివ

  చిరంజీవిని ఆచార్యగా మార్చిన కొరటాల శివ

  టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి.

  మెగా మల్టీస్టారర్‌గా మార్పు... 30 నిమిషాలు

  మెగా మల్టీస్టారర్‌గా మార్పు... 30 నిమిషాలు


  ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడితో పూర్తి స్థాయి పాత్రను చేయిస్తున్నాడు చిరంజీవి. అందుకోసం స్క్రిప్టును మార్చి రాయించాడు. ఇందులో 'సిద్ధ' అనే పాత్రను చేస్తున్న మెగా పవర్ స్టార్.. దాదాపు 30 నిమిషాల వరకూ కనిపిస్తాడట. ఇక, అతడి ఎంట్రీతో ఈ మూవీ మెగా మల్టీస్టారర్‌గా మారిపోయింది.

  ఒక్క దానితోనే అంచనాలు.. రికార్డులు కూడా

  ఒక్క దానితోనే అంచనాలు.. రికార్డులు కూడా


  చిరంజీవి సినిమా అంటే ఈలలు వేసేలా ఫైట్ సీన్స్.. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్.. గ్రేస్‌తో కూడిన స్టైల్స్ ఆశిస్తుంటారు అభిమానులు. వాటన్నింటినీ దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' టీజర్ వీడియోలో చూపించాడు. దీంతో దీనికి మెగా అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండై ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

  ఇద్దరూ కలిసి అడవిలోకి.. ఆమె కూడా చేరింది

  ఇద్దరూ కలిసి అడవిలోకి.. ఆమె కూడా చేరింది


  'ఆచార్య'లో చిరంజీవితో పాటు చరణ్ నక్సలైట్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ షెడ్యూల్‌లోనే ఆమె కూడా యూనిట్‌తో కలవనుంది.

  ముందే బయటకొచ్చిన ‘ఆచార్య’ మూవీ హైలైట్స్

  ముందే బయటకొచ్చిన ‘ఆచార్య’ మూవీ హైలైట్స్


  మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్‌తో పాటు ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్న కారణంగా 'ఆచార్య' ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఏది బయటకు వచ్చినా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ జాబితా వివరాలతో పాటు కొన్ని హైలైట్లు తాజాగా బయటకు వచ్చేశాయి.

  ఆ రెండు సందర్భాల్లో గూస్‌బమ్స్ ఖాయమట

  ఆ రెండు సందర్భాల్లో గూస్‌బమ్స్ ఖాయమట


  తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' కోసం మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేశాడట. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలిసింది. వీటిలో చిరంజీవి - చరణ్ మధ్య వచ్చే మాస్ సాంగ్ హైలైట్ కానుందని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే కాళికాదేవి సాంగ్‌తోనే ఫైట్ జరుగుతుందని అంటున్నారు. ఈ రెండూ గూస్‌బమ్స్ తెప్పించడం ఖాయమని టాక్.

  చిరంజీవి కెరీర్‌లోనే చూడని విధంగా ఇందులో

  చిరంజీవి కెరీర్‌లోనే చూడని విధంగా ఇందులో


  'ఆచార్య'లో శివుడికి సంబంధించిన పాట ఒకటి.. చిరంజీవి - కాజల్ మధ్య మరొకటి.. చరణ్ - పూజా హెగ్డే మధ్య ఇంకొకటి ఉంటుందట. ఇక, చిరంజీవి - రెజీనా మధ్య వచ్చే స్పెషల్ సాంగ్ అన్నింటిలో హైలైట్‌గా ఉంటుదని తెలిసింది. మెగాస్టార్ కెరీర్‌లోనూ గతంలో ఎన్నడూ చూడని స్టెప్పులు, గ్రేస్ ఇందులో కనిపిస్తుందని టాక్. ఇక, చరణ్‌ ఎంట్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ అరుపులు పెట్టిస్తుందని సమాచారం.

  English summary
  Acharya is an upcoming Indian Telugu-language action drama film directed by Koratala Siva and produced by Ram Charan and Niranjan Reddy under the Konidela Production Company and Matinee Entertainments banners. The film stars Chiranjeevi and Kajal Aggarwal while Charan is set to play a crucial role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X