»   » చిరు ఆఫర్...ఎమోషన్ అయిన పవన్ ?

చిరు ఆఫర్...ఎమోషన్ అయిన పవన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా మెగా బ్రదర్శ్ ..చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ పై కలుసుకుని మీడియాలో సంచలన వార్తగా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయిక వెనకా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా..క్యాజువల్ గా కలిసారని మెగాభిమానులు అంటున్నారు.

ఎందుకు కలిసారు..ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రక్కన పెడితే...దాదాపు రెండు గంటలు పైగా అక్కడ గడిపిన చిరంజీవి..పవన్ తో ..నలభై నిముషాలు పాటు మాట్లాడారు. ఆయన సర్ధార్ స్టోరీ లైన్ విని ఇప్రెస్ అయ్యారని, అలాగే ఫైనల్ అవుట్ ఫుట్ కోసం పవన్ చేస్తున్న కృషిని మెచ్చకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కు ఆనందం కలిగించే ఆఫర్ పవన్ కు ఇచ్చారని అంటున్నారు.

Chiranjeevi's Bumper Offer for Pawan?

అది మరేదో కాదు.. ఈ మార్చిలో జరగబోతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా రావటం. దాంతో తమ అభిమానుల మధ్య ఉన్న విభేధాలు తొలిగే అవకాసం ఉందని, తామంతా ఎవరి పనులతో వారు బిజీగా ఉన్నా మనస్సులు కలిసే ఉన్నామని చెప్పటం ఉద్దేశ్యమని పవన్ తో అన్నట్లు సమాచారం.

వెంటనే పవన్ కూడా చాలా ఆనందపడ్డాడని, తన అన్నయ్య చీఫ్ గెస్ట్ గా వస్తానంటే అంతకు మించి ఆనందం ఏముంటుందని ఎమోషన్ అయ్యినట్లు చెప్పుకుంటున్నారు. బ్రూస్ లీ రిలీజ్ అనంతరం కూడా చిరు, పవన్ లు కలిసి తాము ఒకటే అనే భావనను అభిమానుల్లోకి పంపే ప్రయత్నం చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

English summary
Megastar Chiranjeevi offered to grace the audio launch of 'Sardaar Gabbar Singh' in March this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu