»   » రీఛార్జ్ అవ్వాలనే చిరంజీవి ఈ నిర్ణయం

రీఛార్జ్ అవ్వాలనే చిరంజీవి ఈ నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజకీయనాయకుడుగా కాకుండా మెగాస్టార్ గా చిరంజీవికి అభిమానులు ఎక్కువ. అయితే ఆయన స్వంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లో వెళ్లి కేంద్ర మంత్రి పదవి సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా అవ్వాలన్న కల నెలవేరలేదు. మరో ప్రక్క సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం పోతూ వస్తోంది. రోడ్ షో లతో, రాజకీయాలతో విసుగెత్తిన ఆయన తన అభిమానులను ఆనందపరిచే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అదే ఆయన 150 సినిమా పూర్తి చేయాలని...అందుకోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వి వి వినాయిక్ ఈ స్క్రిప్టుని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఇది తన అభిమానులను ఉత్తేజపరిచి రీఛార్జ్ చేయటానికి, అలాగే తనను తాను రీఛార్జ్ చేసుకోవటానికి అవలంభిస్తున్న పంధాగా చెప్తున్నారు.

Chiranjeevi's comeback to movies soon

చిరంజీవి రాజకీయాల బాట పట్టినప్పటకీ చివరి సారిగా అభిమానుల కోసం 150 సినిమా తీస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే చిరంజీవి నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా విషయమై సరైన క్లారిటీ రాలేదు. చేయాలని ఉందని ఒకసారి, చేయడం వీలు కాదని ఒకసారి ప్రకటనలు చేస్తూ అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నారు చిరు.

అయితే టాలీవుడ్ లో మాత్రం చిరు 150 చిత్రంగా గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంది. చిరంజీవి ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథపై ఆసక్తి చూపుతున్నాడని, పూరి, వివివినాయక్, శంకర్, మురుగదాస్ లలో ఎవరో ఒకరి దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే ఈ సారి ఖచ్చితంగా ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

English summary

 Chiru is having a second thought about his political career. If a buzz doing the rounds in political circles is to be believed, then Chiranjeevi is seriously contemplating giving his nod to the much delayed 150th movie to be helmed by VV Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu