మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చేదు వార్త!
హైదరాబాద్: అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టినరోజు నాడే ఆయన 150వ సినిమా వివరాలు చెబుతామన్నారు. కానీ వాయిదా వేసారు. మరింత జాప్యం చేస్తూ వస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం కూడా చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఆ మధ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేపాల్ లోని పుశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఆలయ పండితులు ఓ విషయం సూచించారట. ఏ కొత్త ప్రాజెక్టు అయినా కార్తీక మాసం తర్వాతే మొదలు పెట్టాలని సూచించారట. ఇదీ ఓ కారణంతో పాటు ఇప్పటికి చిరంజీవి ఏ స్టోరీ కూడా ఫైనలైజ్ చేయలేదట. రెండు రోజుల్లో డిసెంబర్ నెల మొదలవుతున్నా స్టోరీ ఖరారు కాలేదంటే ఆయన 150వ సినిమా ఈ ఏడు లేనట్లే అంటున్నారు.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ 150వ సినిమాపై స్పందిస్తూ.....ఏ విషయమైనా నవంబర్లో వెల్లడిస్తామన్నారు. ఇప్పటి వరకైతే రామ్ చరణ్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. 150వ చిత్రాన్ని ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి తనకు సూటయ్యే, అభిమానులకు నచ్చే స్టోరీ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వివిధ స్టోరీలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఏదో ఒక స్టోరీ ఫైనల్ కానుంది.
ఒకప్పుడు తన సినిమాలతో తెగ ఎంటర్టైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్'. 2007లో వచ్చిన ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఆయన అలా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వలన ఆయన చేయాల్సిన 150వ సినిమా పెండింగ్ ఉండిపోయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన రోజు నుంచి మెగా అభిమానులు కాస్త ఖాళీ టైం చూసుకొని మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా తీస్తారని వేచి చూస్తున్నారు.
ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications