»   »  తండ్రి సొంత గ్రామం పేరు కలిసొచ్చేలా చెర్రీ కొత్త చిత్రం టైటిల్

తండ్రి సొంత గ్రామం పేరు కలిసొచ్చేలా చెర్రీ కొత్త చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి గత కొద్ది రోజులుగా టైటిల్ వేట మొదలైంది. ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పుకున్నారు.

ఆ తర్వాత పల్లెటూరి మొనగాడు అయితే ఎలా ఉంటుందనే ఆలోచన చేసారట. చివరకు తన తండ్రి సొంత గ్రామమైన మొగల్తూరుని టైటిల్ లో వచ్చేలా ..మొగల్తూరు మొనగాడు అని పెడితే బాగుంటుందని ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి. రామ్ చరణ్ రెండు బిందెలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో , పల్లెటూరి వాసనలు గుప్పుమనబోతున్నాయో తెలుస్తోంది. తన కెరీర్‌లో చెర్రీ 'మగధీర', 'ఆరెంజ్' తర్వాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అంటూ అభిమానులు ఇప్పటికే ప్రశంసలు వర్షం కురిపించేస్తున్నారు.

 Chiranjeevi's Native Place preferred for RC11 Title

అలాగే ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంతను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు.

అలాగే కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి చక్కటి లవ్ స్టోరీ గా చిత్రం ఉండబోతుందని, అప్పటి అంశాలను ఎంత అందంగా సినిమాలోకి ఇమడ్చవచ్చా అనే విషయమై దర్శకుడు తన టీమ్ తో కసరత్తులు చేస్తున్నారట. ఇది రామ్ చరణ్ కు గెటప్ నుంచి అంతా డిఫెరెంట్ గా ఉండబోయే చిత్రం అంటున్నారు.

కథ మొత్తం ఎనభైల్లో సాగుతుందిట. అప్పట్లో అంటే సెల్ పోన్ వంటి అనేక టెక్నాలిజీలు యూత్ కు అందుబాటు లోకి రానీ మంచు పల్లకి రోజుల్లో కథ, కథనం నడుస్తుందిట.

English summary
Buzz is that Ram Charan-Sukumar's flick has been titled as'Mogalturu Monagadu'.Regular shoot of Ram Charan's next would begin in March first week.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu