చిరంజీవి సూపర్ హిట్ పాటకు పవన్ తీన్ మార్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో చిరంజీవి కెరీర్ లో మ్యూజికల్ ఎంటర్టైనర్ గా నిలిచిన రౌడీ అల్లుడు చిత్రంలోని సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారు. అందులోని చిలుకా క్షేమమా సాంగ్ ని ఈ రీమిక్స్ కు వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన పాట అని, అందుకే దానిని రీమిక్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిందీ హిట్ 'లవ్ ఆజ్ కల్" హిందీ చిత్రం ఆధారంగా కొద్దిపాటి మార్పు చేర్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్, సంగీతం: మణిశర్మ. పవన్ కళ్యాణ్ సరసన త్రిష, కృతికర్బందా హీరోహీరోయిన్లుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం మార్చి 28 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











