సెంటిమెంట్ సుడిలో సైరా.. రిలీజ్ డేట్ ఫిక్స్!

By Rajababu

Recommended Video

Chiranjeevi's Sye Raa Narasimha Reddy Movie Release Date Locked

ఖైదీ నంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ల సునామీనే సృష్టించారు. మరోసారి బాక్సాఫీస్‌ వద్ద అలజడి సృష్టించడానికి సైరా నర్సింహరెడ్డితో సిద్ధమవుతున్నది. తొలుత ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వినవచ్చాయి. కానీ ఈ చిత్ర రిలీజ్‌ను చిరంజీవికి సెంటిమెంట్ డేట్‌గా మారిన ఓ తేదీనే రిలీజ్ చేయాలని ఖారారు చేసినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త వైరల్ అయింది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని సైరా నర్సింహరెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయాలని నిర్మాత రాంచరణ్ ఫిక్సయ్యాడట.

 సెంటిమెంట్ డేట్

సెంటిమెంట్ డేట్

టాలీవుడ్‌లో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవికి మే 9వ తేదీకి ఓ అవినాభావ సంబంధం ఉంది. ఆ తేదీన ఓ సెంటిమెంటిగా భావిస్తారు. అదే రోజున చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ చిత్రం రిలీజైంది. ఆ రెండు చిత్రాలు చిరంజీవి కెరీర్‌లో ఆణిముత్తాలుగా నిలిచాయి ఇటీవల మహానటి కూడా అదే రోజు విడుదలై ఘన విజయం సాధించింది.

సమ్మర్ జోష్

సమ్మర్ జోష్

టాలీవుడ్‌లో సాధారణంగా వేసవి సెలవుల్లో భారీ బడ్జెట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్‌లో వచ్చిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. గతేడాది వచ్చి బాహుబలి, ఈ ఏడాది రిలీజైన రంగస్థల, భరత్ అనే నేను చిత్రాలు అనూహ్య విజయాలు సాధించాయి.

 మే 9న సైరా

మే 9న సైరా

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని సైరా నర్సింహరెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయాలని నిర్మాత రాంచరణ్ ఫిక్సయ్యాడట. సైరా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

 సైరాలో తమన్నా ఎంట్రీ

సైరాలో తమన్నా ఎంట్రీ

కాగా, సైరా చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో తమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్, నయనతార తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X