మెగా అభిమానులకు షాక్.. 'సైరా నరసింహా రెడ్డి' క్లైమాక్స్ లీక్!

Recommended Video

Sye Raa Narasimha Reddy Climax Sequence Revealed || మెగా అభిమానులకు షాక్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఈ తరుణంలో 'సైరా నరసింహా రెడ్డి' క్లైమాక్స్ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. వివరాల్లోకి పోతే..

తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ

తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ

సైరా నరసింహా రెడ్డిలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర పోషించారు. అయితే ఈ పాత్ర క్లైమాక్స్‌లో చంపి వేయబడుతుందని సమాచారం. చిరంజీవి ఫ్యాన్స్ గుండె బద్దలయ్యేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా ఈ సన్నివేశం చిత్రీకరించారని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

భీకర యుద్ధంలో అసులువు బాసి..

భీకర యుద్ధంలో అసులువు బాసి..

నిజానికి చరిత్ర ప్రకారంగా చూస్తే.. అప్పట్లో బ్రిటిష్ సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసులువు బాశారు. ఆయన మృతదేశాన్ని ఓ నెల పాటు కొండపైనే ఉంచడం జరిగింది. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా, తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసేలా చిత్రీకరించారని తెలుస్తోంది.

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి

'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిరంజీవిపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఊహలకు అందనివిగా ఉండనున్నాయట. చిరంజీవి పాత్రను హైలైట్ చేస్తూ భారీ రేంజ్‌లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిసి పోయింది. ఇక ఇందులోని అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్ థియేటర్స్‌లో చూడండని చిత్ర యూనిట్ పేర్కొనడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

 సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X