Sye Raa రేంజ్ అంటే ఇదీ.. ఒక్క హిందీలోనే ఎన్ని స్క్రీన్స్ అంటే.. రామ్ చరణ్ మెగా పవర్ స్కెచ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ మేరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా సైరా స్క్రీన్స్‌కి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

ప్యాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల్లో ఆతృత
సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా సైరా పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆడియన్స్ అంతా సైరా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఒక్క హిందీ భాష లోనే ఈ రేంజ్
ఇక సైరా నరసింహా రెడ్డి డిమాండ్ చూసిన మేకర్స్ ఒక్క హిందీ భాషలోనే దాదాపు 1500 స్క్రీన్స్‌పై భారీ రేంజ్‌లో ఈ సినిమా విడుదల చేయబోతున్నారట. బాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ సత్తా చూపాలనే కోణంలో అక్కడ ప్రమోషన్స్ పరంగా కూడా దూకుడుగా వ్యవహరించనుందట సైరా యూనిట్.

రామ్ చరణ్ మెగా పవర్ స్కెచ్
సైరా విడుదల తేదీ మరింత దగ్గర పడటంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ మెగా పవర్ స్కెచ్ వేశారని తెలిసింది. ఈ మేరకు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు కేరళ రాష్ట్రంలో అందరినీ ఆకట్టుకునేలా ప్రమోషన్స్ చేపట్టబోతున్నారట రామ్ చరణ్. ఇందుకు గాను ఆయన ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రణాళిక అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

ఇదీ సైరా రేంజ్ అంటే..
విడుదలకు ముందే సైరా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఓ రేంజ్ బిజినెస్ చేసి రికార్డు నెలకొల్పింది సైరా. పైగా ఇప్పటికి వరుకు లేని విధంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తెలుగు సినిమా 'సైరా'నే కావడం విశేషం. దీంతో సైరా రేంజ్ ఏంటో ఇప్పుడే తెలుస్తోంది.. ఇక సినిమా విడుదల తరువాత సంచలనాలు ఊహించగలమా! అంటున్నారు విశ్లేషకులు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











