మెగా ఫ్యాన్స్‌కు మరోషాక్.. సైరాపై మరో రూమర్.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తొలి పోరాటయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సైరాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవానికి సైరాను దసరా పండుగకు రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు దసరా బరిలో దూకే పరిస్థితి కనిపించడం లేదనేది టాలీవుడ్ వర్గాల టాక్... వివరాల్లోకి వెళితే..

సైరా మరోసారి వాయిదా

సైరా మరోసారి వాయిదా

సైరా నర్సింహరెడ్డి చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్నది. ఈ చిత్రానికి పేరున్న టెక్నికల్ టీమ్ పనిచేస్తున్నది. గ్రాఫిక్స్ వర్క్‌కు పెద్ద పీట వేయడంతో ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యం కానున్నట్టు సమాచారం. గతంలో ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ను మరికొంత ముందుకు జరిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

సంక్రాంతి సెంటిమెంట్‌తో

సంక్రాంతి సెంటిమెంట్‌తో

తొలుత అనుకున్న ప్లాన్ ప్రకారం దసరాకు సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి ఎదురవుతున్నదట. దాంతో దసరా లక్ష్యంగా చేసుకొన్న డైడ్‌లైన్‌ను సంక్రాంతి పండుగకు షిప్ట్ చేసినట్టు తెలిసింది. దాంతో ఈ సినిమా జనవరి 2020లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది. గతంలో దసరా బరిలో దూకిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్‌ను అందుకొన్న సంగతి తెలిసిందే.

శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు

శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు

సైరా సినిమా షూటింగ్ ఓ పక్క.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరోపక్క శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండోవారంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చనేది చిత్ర యూనిట్ వెల్లడిస్తున్న సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో మరింత వేగం పుంజుకొనే అవకాశం లేకపోలేదు.

మెగా అభిమానులకు ఇది నిరాశ..

మెగా అభిమానులకు ఇది నిరాశ..

దసరా రిలీజ్ కోసం వేచి చూస్తున్న మెగా అభిమానులకు ఇది నిరాశ పరిచే వార్తే అని చెప్పవచ్చు. అయితే విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ వార్తపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్పా.. దసరాకు వస్తుందా లేక సంక్రాంతికి రిలీజ్ అవుతుందా? అనే విషయంపై క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.

 రూ.200 కోట్ల బడ్జెట్‌తో

రూ.200 కోట్ల బడ్జెట్‌తో

సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో జాతీయ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ చిత్రంలో దేశ సినిమా పరిశ్రమలోని క్రేజీ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X