స్టార్ హీరోయిన్‌కి రెండో పెళ్లంటూ ప్రచారం .. షాకిచ్చిన చిరంజీవి భార్య
భర్త నుంచి విడిపోయిన వాళ్లు, భర్త మరణంతో ఒంటరిగా జీవిస్తున్న వాళ్లు మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. సమాజానికి భయపడి ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న వాళ్లు కూడా తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ టాప్ సింగర్ సునీత 40 ప్లస్‌లో రెండో పెళ్లి చేసుకుని ఎంతో మందిలో స్పూర్తిని తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో తోడు లేక ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తున్న వారెందరో. తాజాగా భర్త మరణంతో కుమిలిపోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

గుండెపోటుతో చిరంజీవి సర్జా హఠాన్మరణం
కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం పరిశ్రమకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో 2020 జూన్ 4న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిరంజీవి తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగానే చిరంజీవి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడవంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విషాదంలో కూరుకుపోయారు.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2009లో హీరోగా వాయుపుత్ర సినిమాతో హీరోగా మారారు. ఆకే, సింగా, సంహారా వంటి సినిమాల్లో నటించి మేనమామ అర్జున్ బాటలో యాక్షన్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి సర్జా మరణించే నాటికి హీరోగా నాలుగు సినిమాలకు కమిట్ కాగా.. ఓ సినిమాను కంప్లీట్ చేశారు. సినీ నటి మేఘనా రాజ్‌తో దాదాపు పదేళ్ల పాటు డేటింగ్ చేశాక.. 2018 మే 2న పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడారు. వీరి దాంపత్యానికి గుర్తుగా మేఘన గర్భం దాల్చారు. అయితే కొద్దినెలలకే చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. ఆ తర్వాత మేఘన.. రాయన్ రాజ్ సర్జా అనే బాబుకు జన్మనిచ్చారు. పిల్లాడిలోనే భర్తను చూసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు మేఘన.
ఈవీవీ చేతుల మీదుగా సినిమాల్లోకి మేఘన
భర్త గురించి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనపై ప్రేమను చాటుకుంటున్నారు మేఘన. అయితే ఆమె వయసు ఇంకా 35 ఏళ్లే కావడంతో రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మేఘన రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా మీడియాలోనూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈమె తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాతోనే వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు కన్నడ చిత్రాల్లో నటించారు. భర్త మరణంతో ఆ బాధ నుంచి బయటికి రావడానికి సినిమాల్లో బిజీ అయ్యారు. చివరిసారిగా తస్మా తద్భవ అనే చిత్రంలో నటించిన మేఘనా రాజ్.. బుద్ధివంతను పూర్తి చేశారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
రెండో పెళ్లి ఆలోచన లేదు
పలుమార్లు తన రెండో పెళ్లిపై మీడియాలో గాసిప్స్ రావడంతో మేఘనా రాజ్ స్పందించారు. కొందరు తనను పెళ్లి చేసుకోమంటున్నారని, ఇంకొందరు నా బిడ్డను చూసుకుంటూ జీవితం గడిపేయమని అంటున్నారని .. మరి నేను ఎవరి మాట వినాలని ఆమె ప్రశ్నించారు. కానీ తన భర్త ఎప్పుడూ ఓ మాట అనేవారని.. ఎవరు ఎమనుకున్నా నీ మనసుకు నచ్చిందే చేయమని చెప్పేవారని మేఘన అన్నారు. రేపటి గురించి నేను ఆలోచించలేదని .. అందుకే రెండో పెళ్లి గురించి నన్ను నేను ప్రశ్నించుకోలేదని మేఘన తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











