‘డాడీ....’తో నటించాలన్న కల కలగానే మిగిలిపోయింది: చరణ్
చిరంజీవి రిటైర్మెంట్ పట్ల రామ్ చరణ్ ఏమాత్రం సంతోషంగా లేడు. చిరంజీవిని మళ్ళీ సినిమాల్లోకి తేవాలని విశ్వప్రయత్నం చేసిన వారిలో చరణ్ ముందుంటాడు...తన తండ్రి 150వ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించాలని కూడా చరణ్ కోరుకున్నాడు. ఆ మధ్య బాగా లావెక్కిన చిరంజీవిని సన్నబడమని ఉత్సాహపరిచింది, ఆయన సన్నబడేందుకు ఆరోగ్యకరమైన పద్థతులు అన్వేషించింది కూడా చరణే అంటారు. అయితే మళ్లీ సినిమాల్లో నటించడానికి అనువుగా తనని తాను మలుచుకున్న తర్వాత ఇక అస్సలు ఎప్పటికీ నటించబోనని చిరంజీవి ప్రకటించడంతో చరణ్ విస్తుపోయాడు. ఎప్పటికైనా తండ్రితో కలిసి మంచి చిత్రాల్లో నటిస్తానని ఆశించిన చరణ్ కి ఆ కల నెరవేరలేదు..
డాడీతో కలిసి కజరారే....లాంటి పాటకి డాన్స్ చేయాలని కోరుకున్నానని, అది ఇక ఎప్పటికీ తీరని కల అంటే నమ్మలేకపోతున్నానని చరణ్ పేర్కొన్నాడు. తన తండ్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించి, ఇప్పటికీ నటిస్తున్న అభిషేక్ బచ్చన్ ని చూస్తే తనకి అసూయగా ఉందని, నా కోరిక పైన మగధీర లో కూడా ఒక బిట్ చేసారని చరణ్ చెప్పాడు.. కొడుకు ముచ్చట తీర్చడానికైనా చిరంజీవి ఒకటి, రెండు సినిమాల వరకు తీరిక చేసుకుంటే బాగుంటుందేమో కదూ..!?


Click it and Unblock the Notifications











