సైరా విషయంలో చిరు జాగ్రత్తలు.. ఎక్కువ సమయం అక్కడే!
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా అక్టోబర్ 2 తేదీన విడుదల కానుంది. మెగాస్టార్ 151 వ సినిమాగా వస్తున్న సైరా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు చిరంజీవి, రామ్ చరణ్. సాధారణంగానే సీనియర్ నటుడు చిరంజీవి తన సినిమాల పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. షూటింగ్ దగ్గర నుంచి ఫైనల్ అవుట్ పుట్ ఎడిటింగ్ వరకు ఆయన పర్యవేక్షణ ఉంటుంది. డైరెక్టర్ తో పాటు చిరు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'సైరా' విషయమై ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారట చిరు.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న క్రమంలో ఈ సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువైపోతోందట. ఇలా అయితే ప్రేక్షకులకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుందని భావించిన చిరు.. ఈ విషయమై దర్శకుడితో చర్చిస్తున్నారని తెలుస్తోంది. సినిమా లెంగ్త్ విషయమై తానే స్పెషల్ కేర్ తీసుకుంటూ ప్రతీరోజు ఎడిటింగ్ టేబుల్ వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారట చిరు. అవసరం లేని కొన్ని సీన్స్ కట్ చేయిస్తూ లెంగ్త్ తగ్గించే ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి.


Click it and Unblock the Notifications











