15 నిమిషాలకే 12 కోట్ల రూపాయలు.. చిరంజీవి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా!
ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఆయన.. ఇప్పటికే పలు సినిమాల ద్వారా వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా 'విశ్వంభర'ను చేస్తున్న సంగతి తెలిసిందే. 'బింబిసార'తో గ్రాండ్ ఎంట్రీని అందుకున్న మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ రేంజ్‌లోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు.

ముల్లోకాలు అనే కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన నటీనటులపై కీలకమైన సీన్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో ఊహించని అద్భుతమైన అంశాలను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో వీఎఫ్ఎక్స్ కోసం ఎవరూ ఊహించనంత బడ్జెట్‌తను పెడుతున్నారట.
మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' సినిమాలో ఓ సందర్భంలో వచ్చే వీఎఫ్ఎక్స్ సీన్ అదిరిపోయేలా ఉంటుందట. దాదాపు 15 నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్రలు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











