మెగా సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది.. చిరంజీవి ఫ్యాన్స్ ఊహించని విధంగా!
టాలీవుడ్‌లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయారు చిరంజీవి. అప్పటి నుంచి అంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ వెళ్తున్నారు. ఇప్పటికి కూడా తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలతో వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.
'బింబిసార'తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో ముల్లోకాలను చుట్టి వచ్చే అతీత శక్తులున్న వ్యక్తిగా చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు.

టెక్నికల్ వండర్‌గా రాబోతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 50 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి అయిపోయింది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ ఫ్యాన్స్ సంతృప్తి పడేలా వీడియోలు విడుదల కాలేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని తాజాగా ప్లాన్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది. దీన్ని దసరా కానుకగా తీసుకు రాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందని చెప్తున్నారు. దీన్ని మెగా ఫ్యాన్స్ ఊహించని విధంగా వైవిధ్యంగా కట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. చిరంజీవి హీరోగా చేస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











