మెగా ఫ్యాన్స్‌‌కు చిరంజీవి సర్‌ప్రైజ్.. ఇక్కడ కొడితే ఇండియా షేక్ అయ్యేలా!

తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాప్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో వచ్చి అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) మూవీ చేస్తున్నారు.

'బింబిసార'తో డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో ముల్లోకాలను చుట్టి వచ్చే అతీత శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని భారీ స్థాయిలో తీస్తున్నారు.

Chiranjeevi Starrer Viswambhara Movie Teaser Release On July Last Week

విజువల్ వండర్‌గా రాబోతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌‌ను ఈ ఏడాది ఆరంభంలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్టు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ ఫ్యాన్స్ సంతృప్తి పడేలా వీడియోలు విడుదల కాలేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

Chiranjeevi Starrer Viswambhara Movie Teaser Release On July Last Week

ఫిలిం నగర్ ఏరియా నుంచి వైరల్ అవుతోన్న తాజా సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిరంజీవి ప్లాన్ చేశారట. దీన్ని జూలై చివరి వారలోనే తీసుకు రాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందని అంటున్నారు. అంతేకాదు, దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసి సినిమాను దేశ వ్యాప్తంగా హైలైట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజం అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్‌ తరుణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: viswambhara chiranjeevi chiru 156
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X