‘సైరా’ దర్శకుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా చిరు తనయుడు రామ్ చరణ్ తన సొంత బేనర్ 'కొణిదెల ప్రొడక్షన్స్' పతాకంపై నిర్మిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఈ చిత్రం కోసం ఖర్చు పెడుతున్నారు. సినిమా ప్రారంభమై చాలా కాలం అయింది. అనుకున్న విధంగా షూటింగ్ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

సురేందర్ రెడ్డికి వార్నింగ్
సినిమా షూటింగును షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విఫలం కావడంతో చిరంజీవి అసంతృప్తిలో ఉన్నారని, త్వరిత గతిన పనులు పూర్తి చేసేలా దర్శకుడికి స్ట్రిక్ట్ వార్నింగ్
ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలస్యానికి కారణం ఏమిటి?
సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం షూటింగ్ ముందుగా ప్లాన్ చేసిన లొకేషన్లలో, ముందుగా నిర్ణయించిన తేదీల్లో పూర్తి కాకపోవడమేనంట. షూటింగ్ మొదలైన తర్వాత ఏర్పడిన కొన్ని సమస్యలు కూడా ఆలస్యానికి మరో కారణంగా చెబుతున్నారు.

ఆలోగా డెడ్‌లైన్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు
సినిమా ఓవరాల్ షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. షూటింగ్ వేర్వేరు లొకేషన్లలో ఉండటంతో అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడం కోసం యూనిట్ చాలా కష్టపడాల్సి వస్తోందట. లోపం ఎక్కడ ఉందో సరి చూసుకోవాలని, త్వరత గతిన పూర్తి చేయాలని దర్శకుడికి చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంకా చాలా పని పెండింగ్
షూటింగ్ పూర్తయిన తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ మొదలు కావాల్సి ఉంటుంది. షూటింగ్, విఎఫ్ఎక్స్, ప్రొస్ట్ ప్రొడక్షన్ ఇలా చాలా పనులు మిగిలి ఉండటం, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి పోవడమే చిరంజీవి ఆగ్రహానికి ప్రధాన కారణం.

దసరాకు వస్తుందా?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. షూటింగ్ డిలే అవుతుండటంతో మూవీ అనుకున్న సమాయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? అనే సందేహం నెలకొని ఉంది. తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











