అఖండ ఎఫెక్ట్.. ఆచార్య విషయంలో చిరు సంచలన నిర్ణయం.. మళ్ళీ రీ షూట్?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసి తరువాత సినిమా మీద దృష్టి పెట్టగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా విషయంలో చిరంజీవి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి పిలుపుతో చిత్ర యూనిట్ యమా యాక్టివ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

ఫిబ్రవరిలో ఆచార్య
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చిరంజీవి వయస్సు రీత్యా ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా పరిస్థితుల్లో చేయలేకపోయారు. అందుకే లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా వాయిదా వేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు.

ప్రాజెక్ట్‌లోకి కొరటాల
అయితే ఇప్పటికే షూట్ పూర్తయి దాదాపు ఫైనల్ కాపీ కూడా రెడీగా ఉన్న తరుణంలో కొరటాలను మరోసారి ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చారని సమాచారం. సినిమా లైన్ చాలా ఫ్లాట్‌గా ఉందని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇటీవల విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ పెరిగిందని తెలుస్తోంది.

25 రోజుల పాటు రీషూట్
ఆచార్య కూడా దేవుడికి, దేవాలయానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆచార్యకి కూడా మంచి మాస్ ఎలిమెంట్స్ కావాలని megastar చూస్తున్నారట. అందుకే #NTR30 పనుల్లో బిజీ అయిన కొరటాల శివని మళ్లీ తీసుకొచ్చి స్క్రిప్ట్‌పై వర్క్ చేయిస్తున్నారని తెలుస్తోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు 25 రోజుల పాటు చిత్ర బృందం రీషూట్ చేయనుందని అంటున్నారు.

డేట్స్ కేటాయిస్తారా?
అఖండ ప్రభావంతో ఆచార్య ప్రాజెక్ట్‌కి తగినంత సమయం ఉన్నందున, ఫిబ్రవరిలో విడుదల చేయాలనే భావిస్తునారట. ఆచార్యలో రామ్ చరణ్ అతిథి పాత్ర కూడా ఉండడంతో ఈ రీషూట్‌లకు రామ్ చరణ్ కూడా అవసరం కావచ్చని అంటున్నారు. అయితే మరో మూడు వారాల్లో RRR కోసం భారీ ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రామ్‌చరణ్ అందుకు తగిన డేట్స్ కేటాయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి నక్సలైట్ పాత్రలో
ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి నిర్మిస్తోంది.. ఇక నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ అలాగే నిరంజన్ రెడ్డి ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే రాంచరణ్ కూడా నక్సలైట్ నటించారు.


Click it and Unblock the Notifications











