»   » చిరంజీవికి చెమటలు పట్టిస్తున్నారు

చిరంజీవికి చెమటలు పట్టిస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి రాజకీయ జీవితం నుంచి బ్రేక్ తీసుకుని మళ్లీ మెగా స్టార్ గా తన సత్తా చూపటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన 150 వ చిత్రం కోసం స్క్రిప్టు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి తన శరీరంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టనట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన ఎంపిక చేయబడడ్డ ఫిజికల్ ట్రైనర్స్ ఈ వేసవిలో ఆయనకు చెమటలు పట్టిస్తున్నట్లు సమాచారం. ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22 న ఈ కొత్త చిత్రం ఎనౌన్సమెంట్ ఉండబోతోందని చెప్పుకుంటున్నారు. అప్పటికి ఆయన స్లిమ్ బాడితో రెడీ కావాలనే ఈ కసరత్తులు అంటున్నారు.

రాజకీయనాయకుడుగా కాకుండా మెగాస్టార్ గా చిరంజీవికి అభిమానులు ఎక్కువ. అయితే ఆయన స్వంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లో వెళ్లి కేంద్ర మంత్రి పదవి సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా అవ్వాలన్న కల నెలవేరలేదు. మరో ప్రక్క సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం పోతూ వస్తోంది. రోడ్ షో లతో, రాజకీయాలతో విసుగెత్తిన ఆయన తన అభిమానులను ఆనందపరిచే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అదే ఆయన 150 సినిమా పూర్తి చేయాలని...అందుకోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వి వి వినాయిక్ ఆధ్వర్యంలో పరుచూరి బ్రదర్శ్, చిన్ని కృష్ణ కలిసి ఈ స్క్రిప్టుని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi sweating it out in Gym

టాలీవుడ్ లో చిరు 150 చిత్రంగా గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంది. చిరంజీవి ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథపై ఆసక్తి చూపుతున్నాడని, పూరి, వివివినాయక్, శంకర్, మురుగదాస్ లలో ఎవరో ఒకరి దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే ఈ సారి ఖచ్చితంగా ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.


ఇక మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ జీరోగా మారడంతో రాజకీయంగా పనిలేకుండా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల వైపు దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన 150వ సినిమా గురించి పనుల్లో తలమునకలైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో తన పుట్టినరోజు నాటికి సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఎన్నికల్లో చిరంజీవి ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఓక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హ్యాండిల్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

English summary
Chiranjeevi is also working out hard in gym shedding weight to regain his physique. Many expect that on his birthday Aug, 22nd mega announcement will be made.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu