చిరంజీవి ముందు చిక్కుముడి.. రాంచరణ్ విషయంలో తేల్చుకోలేక పోతున్న మెగాస్టార్

కరోనావైరస్ పరిస్థితులు సినిమా పరిశ్రమపై భారీ ప్రభావం పడబోతున్నాయి. మూడు నెలలుగా షూటింగ్‌లు జరగకపోవడం అనేక సమస్యలకు కారణ కాబోతున్నాయి. అలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్న సినిమాల్లో ఆచార్య ఒకటి. రాంచరణ్ నిర్మాతగా, కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ పరిస్థితులు పొంతన లేని చిక్కును చిరంజీవి, రాంచరణ్ మధ్య పెట్టినట్టు సమాచారం... ఆ చిక్కు ఏమిటంటే..

మూడు నెలలుగా షూటింగుల లేక

మూడు నెలలుగా షూటింగుల లేక

మూడు నెలలుగా షూటింగులు జరగకపోవడంతో సినిమా పరిశ్రమ ఎదుర్కొనబోయే ప్రధాన సమస్య ఆర్టిస్టుల డేట్స్. ఒక సినిమాలో నటించే నటీనటులు మరో సినిమాలో నటించడం సర్వసాధారణం. అయితే ముందస్తుగా అడ్జస్ట్ చేసుకొన్న డేట్స్ కారణంగా రాబోయే రోజుల్లో పెద్ద సమస్య వచ్చి పడటం ఖాయంగా కనిపిస్తున్నది. రాంచరణ్‌కు ఎటు తేల్చుకొని పరిస్థితులు ఏర్పడ్డాయి.

 నిర్మాతగా, నటుడిగా రాంచరణ్

నిర్మాతగా, నటుడిగా రాంచరణ్

రాంచరణ్ నిర్మాతగా, నటుడిగా మారి తన జీవితంలో, కెరీర్‌లో పలు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొంటున్నారు. ఓ వైపు RRR సినిమాలో నటిస్తూ నిర్మాతగా ఆచార్య పనులను చక్కబెడుతున్నారు. అయితే ఆచార్య సినిమాలో ఓ యువకుడి పాత్రను రాంచరణ్ పోషించాలనే నిర్ణయాన్ని చిరంజీవి తీసుకొన్నారు. అయితే ఆ పాత్రలో చెర్రీ కనిపించడం అసాధ్యంగా కనిపిస్తున్నది.

RRR మూవీ లేట్ కావడంతో

RRR మూవీ లేట్ కావడంతో

ఆచార్య సినిమా మొదలుపెట్టినప్పుడు RRR మూవీ‌లో రాంచరణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రకరణ పూర్తవుతుందని భావించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ సినిమా షూట్ కూడా నిరవధికంగా వాయిదా పడింది. దాంతో ఆచార్యకు సంబంధించిన పాత్రను పోషించడానికి రాంచరణ్ గెటప్ ఓ ఇబ్బందిగా మారింది. దాంతో ఆచార్య సినిమాను వదులుకోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తున్నది.

ఆచార్య కంటే RRR కే ప్రాధాన్యం

ఆచార్య కంటే RRR కే ప్రాధాన్యం

అయితే రాంచరణ్‌కు ప్రస్తుతం తండ్రి చిరంజీవి సినిమా కంటే RRR మూవీ ప్రయారిటీగా మారింది. రాంచరణ్‌ RRR సినిమా పూర్తి చేసేంత వరకు వెయిట్ చేయడమనేది చిరంజీవి తీసుకోవాల్సిన నిర్ణయం. లేదా రాంచరణ్‌కు బదులు వేరే నటుడిని పెట్టుకొట్టుకొని ఆచార్యను పూర్తి చేయాలా అనేది మెగాస్టార్ తేల్చుకోవాలి? అని యూనిట్‌కు చెందిన ఒకరు వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
కొరటాల, చిరు కోర్టులో బంతి

కొరటాల, చిరు కోర్టులో బంతి

రాంచరణ్ నటించే విషయం ఇప్పుడు ఆచార్య చిత్రయూనిట్‌లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ విషయంపై దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే వేరే నటుడితో షూటింగ్ పూర్తి చేస్తారా? లేక రాంచరణ్ కోసం వెయిట్ చేస్తారా అనేది కాలమే సమాధానం చెబుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X