బాలయ్య రైటర్‌తో చిరంజీవి మూవీ.. ఫ్యాన్స్‌కు ఏం కావాలో అలాంటి కథతోనే!
ఈ మధ్య కాలంలో ఏకధాటిగా సినిమాలు చేస్తూ.. మరే స్టార్ హీరోలకూ సాధ్యం కాని రీతిలో రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150'తో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. ఆ తర్వాత 'సైరా: నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అదే సమయంలో తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నారు. ఇలా ఇప్పటికే చాలా ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయినప్పటికీ ఆయన కొత్త ప్రాజెక్టుల కోసం కథలను వింటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్లతో చిరు మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఆయనను కలిసి ఓ లైన్ వినిపించాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

గతంలో బీవీఎస్ రవి ఎన్నో చిత్రాలకు కథలను అందించారు. ఈ క్రమంలోనే గోపీచంద్‌తో 'వాంటెడ్', సాయి ధరమ్ తేజ్‌తో 'జవాన్' మూవీలు తెరకెక్కించాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న ఆయన.. బాలయ్య హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోకు పని చేశారు. ఆ సమయంలోనే నటసింహంతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, ఇప్పుడు ఊహించని విధంగా బీవీఎస్ రవి.. చిరంజీవికి కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగాయని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందని టాక్.
బీవీఎస్ రవి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఓ బడా నిర్మాత నిర్మించబోతున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ చిత్రం కోసం సదరు దర్శకుడు మెగా ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ కావాలో దాన్నే రాసుకున్నాడని కూడా అంటున్నారు. దీంతో ఈ కాంబోపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











