»   » కేసీఆర్ సినీ మంత్రం: హైదరాబాద్ లో చిరంజీవి సొంత స్టూడియో!

కేసీఆర్ సినీ మంత్రం: హైదరాబాద్ లో చిరంజీవి సొంత స్టూడియో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు రెండూ విడిపోయిన తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలిపోతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి పరిస్థితి ఏమీ లేదని స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోనే సొంత సినీ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలి పోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న స్టూడియోలు తెలంగాణ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. పరిశ్రమ ఇక్కడే బలంగా ఉండేలా ఆయన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

chiranjeevi

గతంలో చిరంజీవి వైజాగ్ లో స్టూడియో పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. పరిశ్రమలో ఎంతో కీలకమైన చిరంజీవి ఇక్కడి నుండి వెళితే పరిశ్రమ క్రమక్రమంగా తరలివెల్లే అవకాశం ఉండటంతో ఆయన ఇక్కడే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేసారట. ఇందులో భాగంగా చిరంజీవికి సొంత స్టూడియో పెట్టేందుకు స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది.

హీరో బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చిరంజీవి మధ్య ఇందుకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మీ సహాయం ఉంటే హైదరాబాద్ లోనే స్టూడియో నిర్మించేందుకు తాను సిద్దమే అని చెప్పారట.

ఈ మేరకు హైదరాబాద్ శివార్లలో స్థలం కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్నయించినట్లు సమాచారం. కొణిదెల పేరుతో స్టూడియోను నిర్మిస్తారని టాక్. ఇదే నిజమైతే....తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మించే మొదటి స్టూడియో అవుతుంది, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే స్టూడియో అవుతుందని అంటున్నారు.

English summary
After Krishna, Akkineni family and Ramanaidu, Mega Star Chiranjeevi too is planning to build a studio in Hyderabad. Our inside sources have also revealed that Chiranjeevi is keen to name his upcoming film studio Konidela, after his family name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu