మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే.. చిరును ఓ రేంజ్‌లో.. సిద్దమవుతున్న త్రివిక్రమ్

మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఓ చిత్రం చేయాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే అది ఇప్పటి వరకు సాధ్యపడలేదు. అయితే త్రివిక్రమ్ అయితే దర్శకత్వం వహించలేదు కానీ, చిరు కోసం మాటలు రాశాడు. జై చిరంజీవి సినిమాకోసం త్రివిక్రమ్ తన కలాన్ని కదిలించాడు. అందుకే ఆ చిత్రం ఆసాంతం నవ్వులను పంచుతూ ఉంటుంది. ప్రతీ సీన్‌కు పంచ్‌లు పడుతూ ఉంటాయి. మరి అదే త్రివిక్రమ్ చేయి పడితే ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో చూపించేందుకు సిద్దమవుతున్నాడని టాక్. ఇంతకీ ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

ఇండస్ట్రీ హిట్‌తో జోష్..

ఇండస్ట్రీ హిట్‌తో జోష్..

అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన జోష్‌లో ఉన్నాడు త్రివిక్రమ్. అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ తరువాత..అల వైకుంఠపురములోతో రికార్డులన్నింటికి తుడిచిపెట్టేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి భారీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్దమయ్యాడు.

అయినను పోయిరావలె..

అయినను పోయిరావలె..

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేయబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా టైపులో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా త్రివిక్రమ్ తన గారడితో మరో బ్లాక్ బస్టర్ రెడీ చేయబోతోన్నాడని ఇప్పటికే ఫ్యాన్స్ సంబరాల్లో తేలిపోయారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి రానున్నట్లు తెలుస్తోంది.

ఆచార్యతో చిరు..

ఆచార్యతో చిరు..

కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న చిత్రం ఆచార్య. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్‌ను సగ భాగం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ విడుదల తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు నిర్మాతలు. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ మారడంతో ఆ ప్రభావం దీనిపై పడింది. మొత్తానికి ఈ ఏడాది చివరకు చిరు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Mahesh Babu To Host Bigg Boss Telugu After Jr NTR,Nani & Nagarjuna | Filmibeat
ఈ ఏడాది చివరకు..

ఈ ఏడాది చివరకు..

ఇటు చిరంజీవి, అటు త్రివిక్రమ్ ఈ ఏడాదికి కలవబోతోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో చిరును ఓ రేంజ్‌లో చూపించాలని ఫిక్స్ అయ్యాడట. అన్నింటికంటే ముఖ్యంగా కామెడీ టైమింగ్‌లో మరో లెవెల్‌కు తీసుకెళ్లేట్టు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్నాడని టాక్. ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X