ఫ్రీడమ్ ఫైటర్ మారనున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి త్వరలో తన 150వ సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందు కోసం ఆయన 10 కిలోల బరువు కూడా తగ్గారు. రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో సినిమా చేస్తానో? చేయనో అనే అనుమానాలు వ్యక్తం చేసి అభిమానులను అయోమయానికి గురి చేసిన చిరు...ఎట్టకేలకు ఇటీవల 150 చేస్తానని స్పష్టం చేశారు.
అయితే చిరంజీవి తీయబోయే 150 వ సినిమా సబ్జెక్టు ఏమిటి? అనే సందేహాలు మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటి వరకు చాలా కథలు పరిశీలించిన మెగాస్టార్ చివరకు ఓ ఫ్రీడమ్ ఫైటర్ కథను ఖరారు చేసినట్లు తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో చిరు నటిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ చిరంజీవి నిర్ణయం వెలువడ బోతోంది. చిరు సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక చిరు నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం. బాలయ్య, మోహన్ బాబులు కూడా ఇదే కథపై ఆసక్తి కనబరుస్తుండటంతో వారి కంటే ముందే ప్రకటన చేసేందుకు చిరంజీవి సిద్దం అవుతున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు. బ్రిటిష్ వారిపై పోరాటడమే కాదు, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. ఈయన జీవితం ఆధారంగా కథను తయారు చేసి చిరంజీవి ఇమేజ్ కు తగిన విధంగా చేర్పులు, మార్పులు చేశారట.


Click it and Unblock the Notifications











