చెప్పింది ఒకటి చేసింది ఒకటి.. బాధలో మెగాస్టార్.. ఇంటికి సినీ ప్రముఖులు.. ఏం చెప్పారంటే?

మెగాస్టార్ చిరంజీవి కొంత మంది సినీ హీరోలు, దర్శకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు కొంతకాలంగా ఉన్న సమస్యలు తొలగి పోయినట్లే అని చిరంజీవి ప్రకటించారు. ఇక శుభం కార్డు పడిందని త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ప్రకటించారు. అయితే ఆ తర్వాత చిరంజీవి చేతులు జోడించి వైయస్ జగన్ ను వేడుకున్నట్లుగా వచ్చిన వీడియో మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి అలా చేతులు జోడించడం తనకు నచ్చలేదని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు పేర్కొంటూ ఉండగా ఈ వ్యవహారంలో చిరంజీవి కూడా బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
పరిష్కారం అయినట్టే

పరిష్కారం అయినట్టే

తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు తీర్చాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ఒక బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ లాంటి వారందరూ కలిసి వెళ్లి ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సహా మహేష్ బాబు, ప్రభాస్ రాజమౌళి ఆర్.నారాయణమూర్తి వంటి వారు మీడియాతో మాట్లాడారు. దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమస్య పరిష్కారం అయినట్టే అని వాళ్లు ప్రకటించారు.

 ఏమాత్రం నచ్చలేదు

ఏమాత్రం నచ్చలేదు

ఆ ప్రెస్ మీట్ పూర్తయిన వారు హైదరాబాద్ వచ్చే సరికి ఆ భేటీలో చిరంజీవి సహా ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారు ఏమి మాట్లాడారో అనే విషయాలు, వీడియోలు బయటకు వచ్చాయి.. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి మిమ్మలని వేడుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన దృశ్యాలను తెలుగు సినీ పరిశ్రమ సహా చిరంజీవి అభిమానులు కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవికి సన్నిహితుడిగా పేరు ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ అయితే చిరంజీవి ఇలా చేస్తాడు అని అనుకోలేదు అని ఆయన అలా ప్రవర్తించడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

చిరంజీవి కూడా బాధలో

చిరంజీవి కూడా బాధలో

అయితే నిజానికి ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ భేటీ జరిగిన తరువాతి రోజు అంటే శుక్రవారం నాడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు వచ్చారని, వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయం మీద ఆరా తీశారని తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద చిరంజీవి బాధపడుతూ తాను ఎలా మోసపోయాను అనే విషయాన్ని కూడా వారితో వెల్లడించారని చెబుతున్నారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ఒక జీవో విడుదల అవుతుంది అంటూ ఒక నమూనా జీవో కు చూపించారు అని ఈ భేటీ ముగిసిన మీరు వెళ్లే లోపు దానిని విడుదల చేస్తామని చెప్పారని కానీ అలాంటివి ఏమీ జరగలేదని మెగాస్టార్ చిరంజీవి బాధ పడినట్లు సమాచారం.

చేసేది ఏమీ లేదని

చేసేది ఏమీ లేదని

నిజానికి చిరంజీవి స్వయంగా మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారితో మాట్లాడి, వారిని ఒప్పించి తీసుకుని బేటీ కోసం తాడేపల్లి వెళ్లారు. అయితే ఈ భేటీ జరిగిన వెంటనే జీవో వస్తే తాను ఇంత మందిని తీసుకుని వెళ్ళిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని మెగాస్టార్ భావించారట. కానీ ఆ జీవో ఎప్పటికి వస్తుందో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి కనిపిస్తోందని నెలాఖరులోపు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదని చిరంజీవి చెప్పిన పరిస్థితి కనిపిస్తోందట. అయితే చిరంజీవి భేటీ కావడం మీద కూడా అనేక వివాదాలు ముసురుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి సారి చిరంజీవి భేటీ అయిన సమయంలోనే మంచు విష్ణు అది మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత భేటీ కానీ సినీ పరిశ్రమతో జరిపిన భేటీ కాదని తేల్చారు.

 తల నొప్పి వ్యవహారాలు

తల నొప్పి వ్యవహారాలు


పరిశ్రమతో భేటీ అంటే ఫిలిం చాంబర్ అనేది ఒకటి ఉంటుందని ఆ ప్రతినిధులు ఉన్న సమయంలోనే దానిని పరిశ్రమతో భేటీ అని భావించాలి అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా మంచు విష్ణు మంచు, మోహన్ బాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నరేష్ అదే విధంగా అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇక ఏదో ఒక విధంగా ఆ జీవో కనుక వస్తే తాను మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని ఇక మీదట ఇలాంటి తల నొప్పి వ్యవహారాలు తనకు వద్దని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అభిమానులు కూడా చాలా మంది మెగాస్టార్ చిరంజీవి అలా వేడుకోవడం చూసి జీర్ణించుకోలేక పోతున్నారు. మొత్తంమీద జిఓ గనుక వస్తే ఇక ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లు అవుతుందని మెగాస్టార్ భావిస్తున్నారు. ప్రభుత్వ అంచనాల మేరకు ఈ నెల ఆఖరి లోగా ఈ సవరణలకు సంబంధించిన ఒక జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X