Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సినిమా రిలీజ్ డేట్‌పై డైలమా.. అదొక్కటే పెండింగ్..
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విశ్వంభర'. అంజి తర్వాత చిరంజీవీ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ఇదే కావటంతో.. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా ' విశ్వంభర' వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, కొత్త డేట్ ఫిక్స్ చేసేందుకు మూవీ మేకర్స్ తెగ తిప్పలు పడుతున్నారంట. అన్ని సెట్ అయినా.. ఓ డీల్ ఇంకా జరగలేదంట. దీంతో చిరంజీవి సినిమా రీలీజ్ డేట్ పై డైలామాలో పడ్డారు. ఇంతకీ ఏం జరిందంటే?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విశ్వంభర' సినిమాకు భారీ క్రేజ్ ఉంది. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకం నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాకు దాదాపు రూ. 100 కోట్లకుపైగానే ఖర్చు పెట్టినట్టు అంచనా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీని డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం వాయిదా పడిందట.

చిరంజీవి విశ్వంభర సినిమాను మే 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మే 9 వ తేదీకి చిరంజీవికి ప్రత్యేకం అనుబంధముంది. మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి'ఆ రోజునే విడుదల అయింది. దీంతో సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరా ను కూడా మే 9 న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఫుల్ క్రేజ్ ఉన్నా ఈ సినిమా ఓటిటి డీల్ పై సందిగ్ధం నెలకొంది.
ఇటీవలి కాలంలో చాలా సినిమాలు విడుదల తేదీలు ఓటీటీ డీల్ పై ఆధారపడుతున్న విషయం తెలిసిందే. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ భారీ మొత్తం వెచ్చిస్తుండటంతో.. ఓటీటీ ప్లాన్ ప్రకారం కొన్ని సినిమాల థియేటరికల్ రిలీజ్ లు ఆధారపడుతున్నాయి. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి విశ్వంభర విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా జరగపోవటంతో థియేటర్లలో రిలీజ్ డేట్‍పై కూడా మేకర్స్ డైలమాలో ఉన్నారు.
విశ్వంభర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలతో ఈ మూవీ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఏదోక సంస్థతో ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని, త్వరలో థియేటర్లలో రిలీజ్ డేట్‍ను లాక్ చేయాలని విశ్వంభర మూవీ మేకర్స్ భావిస్తున్నారంట. ఓటీటీ డీల్ పూర్తి అయినా తరువాత అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.


Click it and Unblock the Notifications











