చిరంజీవి vs రజనీకాంత్.. 2023 క్లాష్ రిపీట్ అవుతుందా?

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య భారీ బాక్సాఫీస్ పోరు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ బడా హీరోల సినిమాలు దసరా బరిలో ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. వీరి సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ సినిమా 'విశ్వంభర'(Vishwambhara), సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న'జైలర్ 2'(Jailer 2) సినిమాలు దసరా బరిలో ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముందుగా దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న 'విశ్వంభర' చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. ఫాంటసీ ప్రపంచాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదట సంక్రాంతి 2025లో విడుదల చేయాలని భావించారు.\

Chiranjeevi vs Rajinikanth Again

అయితే భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ పనులు ఉండటంతో సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ డిస్ట్రిబ్యూటర్లకు చేరినట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

మరోవైపు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'జైలర్ 2'. ఈ సినిమాను కూడా అదే దసరా సీజన్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొదట ఈ సినిమాను సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేసినా, షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ మారినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 15న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఒకవేళ ఇదే జరిగితే అక్టోబర్ 15న 'జైలర్ 2', అక్టోబర్ 16న 'విశ్వంభర' విడుదల కానున్నాయి. దీంతో మరో భారీ బాక్సాఫీస్ సమరానికి తెరలేవనుంది.

గతంలో కూడా రజనీకాంత్, చిరంజీవి మధ్య పలుమార్లు బాక్సాఫీస్ పోరు జరిగింది. అందులో లెటేస్ట్‌ గా 2023 ఆగస్టులో రజనీకాంత్ 'జైలర్', చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఫలితంగా 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరోవైపు 'భోళా శంకర్' మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. ఈ ఫలితం మెగా అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇద్దరు స్టార్ హీరోలు దసరా బరిలో నిలవబోతున్నారనే ప్రచారం ఆసక్తిని మరింత పెంచుతోంది.

అయితే ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'విశ్వంభర' చిరంజీవి కెరీర్‌లో పూర్తి స్థాయి సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది.మరోవైపు 'జైలర్ 2'పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది. నెల్సన్ దర్శకత్వం, రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్, అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మరోసారి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం అంతా ఇండస్ట్రీ వర్గాల ప్రచారం ఆధారంగానే సాగుతోంది. ఒకవేళ ఈ రిలీజ్ డేట్లు ఖరారైతే, 2026 దసరా సీజన్ భారతీయ సినీ పరిశ్రమలోనే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఫాంటసీ ప్రపంచంతో ప్రేక్షకులను అలరిస్తారా? లేక సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా? అనే చర్చ ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X