ఆ దర్శకుడుని ఒప్పించాలని చిరంజీవి ప్రయత్నం
చిరంజీవి 150 సినిమాకు ఎవరు డైరక్ట్ చేయాలనే దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శంకర్ తన సూపర్ హిట్ చిత్రం బారతీయుడుకి సీక్వెల్ తీసే ప్లానింగ్ లో ఉండటం చిరంజీవిని ఆలోచనలో పడేసిందిట.తాను చేయవలిసింది అలాంటి పాత్రనే అని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అందులోనూ అన్నా హజారే స్పూర్తితో ఆ పాత్ర డిజైన్ చేయాలని శంకర్ ఉన్నారని తెలియగానే చిరంజీవి మరో ఆలోచన లేకుండా తను హీరోగా చేస్తానని శంకర్ కి తెలియచేసాడని తెలుస్తోంది.
అయితే తాను డైరక్ట్ గా సీన్ లో లేకుండా తన వాళ్ళ ద్వారా తాను ఆసక్తిగా ఉన్నానని శంకర్ కి తెలిసేలాగ చేసాడని అంటున్నారు. అయితే శంకర్ మాత్రం టెమ్ట్ అవ్వక తాను అజిత్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియచేసాడని చెప్తున్నారు. అయితే తాను మాత్రం ఎలాగైనా ఆ సినిమా చేయాలని చిరంజీవి ఫిక్స్ అయ్యి శంకర్ ని ఒప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక శంకర్ ఇప్పుడు త్రీ ఇడియట్స్ రీమేక్ లో ఉన్నారు. మరో ప్రక్క రాజమౌళి తాను చిరంజీవిని డైరక్ట్ చేయటం లేదని క్లియర్ చేసారు.


Click it and Unblock the Notifications











