చేజార్చాడు: రామ్ చరణ్‌పై చిరంజీవి అసంతృప్తి?
హైదరాబాద్: రామ్ చరణ్ తీరుపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారా? చెర్రీకి ఇంకా సరైన కథలు ఎంచుకునే పరిణితి రాలేదని ఆయన మదన పడుతున్నారా? చేతికొచ్చిన మంచి అవకాశాలను జార్చుకుంటున్నాడని లోలోన ఫీలవుతున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాల్లో!
ఇప్పటికీ రామ్ చరణ్ ఏదైనా సినిమా ఓకే చేయాలంటే....చిరంజీవి కథ వినాల్సిందే. రామ్ చరణ్‌కు ఇంకా సొంతగా సరైన సినిమాలు ఎంపిక చేసుకునే పరిణితి రాకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇటీవల 'మనం' చిత్రం చూసిన తర్వాత రామ్ చరణ్ గురించి మరోసారి ఆలోచనలో పడ్డారట చిరంజీవి.

వాస్తవానికి 'మనం' చిత్రం కథను మొదట రామ్ చరణ్‌కు చెప్పాడట దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే రామ్ చరణ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 'మనం' సినిమా చూసిన తర్వాత దర్శకుడి పని తీరును చూసిన చిరంజీవి.....రామ్ చరణ్ మంచి చాన్స్ చేజార్చుకున్నాడనే ఆలోచనకు వచ్చారట. భవిష్యత్‌లో దర్శకుడు విక్రమ్ కుమార్‌తో పని చేయాలని రామ్ చరణ్, బన్నీలకు సూచించారట.
అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈచిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని నటించిన చివరి సినిమా కావడంతో ఈచిత్రపై ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











