»   » నిజమా....చిరంజీవి షాకిచ్చే నిర్ణయం?

నిజమా....చిరంజీవి షాకిచ్చే నిర్ణయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజకీయాల్లోకి ఎప్పుడైతే దిగాడో అప్పటినుంచో చిరంజీవి తనను నమ్మిన వారికి షాక్ లు ఇస్తున్నాడు...తను షాక్ లు తింటున్నాడు. తాజాగా ఆయన మరో షాక్ జనాలకు ఇవ్వటానికి సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన త్వరలో బీజెపి పార్టీలో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఆయన ప్రచారం చేసిన కాంగ్రేస్ పార్టీ...నామ మాత్రంగా కూడా సీట్స్ ని గెలుచుకోలేకపోవటంతో యు టర్న్ తీసుకుని ఈ నిర్ణయం తీసుకోబోతున్నడని తెలుస్తోంది.

2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చిన చిరంజీవి, కాంగ్రేస్ లో కలిపేసి కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నించారు. కానీ ఆ అవకాసం రాలేదు. కాంగ్రేస్ పార్టీ విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఖాయిలా పడటంతో నిరాశ చెందిన ఆయనకు పవన్ వైపు నుంచి ప్రెజర్ వచ్చిందనే చెప్పాలి. అటు లేటెస్ట్ గా పార్టీ పెట్టి ఎంట్రీ ఇచ్చిన తమ్ముడు అసలు ఎలక్షన్స్ లో నిలబడకుండానే తన పవర్ ఏంటో చూపించారు. కేంద్రలో ప్రభుత్వం స్దాపించిన బీజేపికి సన్నిహితులయ్యారు. దాంతో చిరంజీవి కూడా తన తమ్ముడు ఉన్న పార్టీ లోకే ప్రయాణం పెట్టుకున్నారని తెలుస్తోంది.

 Chiranjeevi Will join BJP

ఇక మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ జీరోగా మారడంతో రాజకీయంగా పనిలేకుండా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల వైపు దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన 150వ సినిమా గురించి పనుల్లో తలమునకలైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో తన పుట్టినరోజు నాటికి సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఎన్నికల్లో చిరంజీవి ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఓక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హ్యాండిల్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

English summary

 Sources report that actor-turned-politician Chiranjeevi is looking to join the Bhartiya Janata Party after the latter's tremendous success in the election polls 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu