చిరుకు జోడీగా ఒకప్పటి టాప్ హీరోయిన్.. చరణ్‌తో కుదరలేదు కానీ ఈయనతో మాత్రం సై.!

'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఊపులోనే తన 151వ సినిమా 'సైరా: నరసింహారెడ్డి'ను కూడా పట్టాలెక్కించేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎందరో ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో చిరుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.

కొరటాలకు గ్రీన్ సిగ్నల్

కొరటాలకు గ్రీన్ సిగ్నల్

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు ‘సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా ఈ సినిమా ప్రారంభం కాలేదు.

ఆ సినిమాతో పోల్చేస్తున్నారు

ఆ సినిమాతో పోల్చేస్తున్నారు

ఇందులో చిరంజీవి హాకీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. అవును.. కొద్దిరోజుల నుంచి ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరంజీవికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాను గతంలో బాలీవుడ్‌లో వచ్చిన ‘చక్‌దే ఇండియా' సినిమాతో పోల్చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా కోసం చిరు బరువు తగ్గారని కూడా ప్రచారం జరిగింది.

రిజెక్ట్ చేసిన ప్రపంచ సుందరి

రిజెక్ట్ చేసిన ప్రపంచ సుందరి

మెగాస్టార్‌తో అవకాశం రావడంతో కొరటాల శివ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా చిరు సరసన నటించే హీరోయిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ సినిమా కోసం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్.

ఎవరూ ఊహించని హీరోయిన్

ఎవరూ ఊహించని హీరోయిన్

ఇక, తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోబోతున్నారట. చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్‌తో మాత్రం చేయలేదు

రామ్ చరణ్‌తో మాత్రం చేయలేదు

ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఇలియానా.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిందింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌, అల్లు అర్జున్ సినిమాల్లో నటించిన ఈ గోవా బ్యూటీ.. రామ్ చరణ్ సరసన మాత్రం కనిపించలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా చిరుతోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X